దొంగల హల్ చల్.. రెండు షాపుల్లో చోరీ..

Update: 2024-08-10 07:45 GMT

దిశ తొర్రూరు: తొర్రూర్ లో దొంగలు హల్ చల్ చేశారు. ఒకేసారి రెండు షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భవాని జనరల్ స్టోర్, పద్మావతి క్లాత్ స్టోర్ రెండు షాపులలో ఒక్కసారిగా ఇద్దరు దొంగలు ముసుగులు వేసుకొని చోరికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి పొడవాటి గుణపం లాంటి కట్టర్ తో షాప్ తాళాలు పగలగొట్టి దొంగతనం చేశారు. సమాచారం అందుకున్న తొర్రూరు డిఎస్పీ సురేష్ బాబు,ఎస్సై రాంజీ నాయక్, రెండు షాపులను సందర్శించిన వెంటనే క్లూస్ టీమ్ ను పంపించి వివరాలు సేకరిస్తున్నారు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై రాంజీ నాయక్ తెలిపారు.

సిగరెట్ డబ్బాలు దొంగతనం చేశారు

శుక్రవారం రాత్రి 9 గంటలకు భవాని జనరల్ స్టోర్ షాప్ కు తాళాలు వేసి వెళ్లిపోయాము. శనివారం రోజున షాపు తెరవడానికి వచ్చి చూడగానే శేటర్ యొక్క తాళాలు పగలగొట్టి ఉన్నాయి.దీంతో షాప్ లో ఏమైనా పోయాయని చూసుకున్నాము. కానీ అంత విలువైన వస్తువులు ఏమి పోలేదు కానీ సిగరెట్ డబ్బాలు మాత్రం అధికంగా చోరీకి పాల్పడ్డారు.అదేవిధంగా గళ్ళలోని ₹10 కాయిన్స్ కూడా తీసుకువెళ్లారు,వాటితో పాటు సీసీ కెమెరా డివిఆర్ బాక్స్ కూడా దొంగలించారని తెలిపారు.

సెల్ సింగ్ భవాని జనరల్ స్టోర్ యజమాని

బట్టలు ఎత్తుకెళ్లారు..

పద్మావతి బట్టల షాపులో అధికంగా బట్టలు దొంగలించారని షాపు యజమాని వాపొయ్యారు.శనివారం ఉదయం షాప్ ఓపెన్ చేస్తామని చూడగానే షాప్ తాళాలు పగలగొట్టి షాపులో నుండి బట్టలు సంచులు దొంగలించారు. వెంటనే సీసీ కెమెరాలు చూడగా శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఇద్దరు వ్యక్తులు ముసుగులు వేసుకొని దొంగతనానికి పాల్పడ్డారు.షాపులో నుండి సుమారుగా 60 వేల నుండి 70 వేయిల వరకు బట్టలు దొంగళించారు.వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందవేశము.

కందకట్ల గోపి,పద్మావతి క్లాత్ స్టోర్ యజమాని

Tags:    

Similar News