MLA : గడువులోగా పనులు పూర్తి చేయాలి
నిర్దేశిత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి(Mayor Gundu Sudharani), వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) అధికారులను ఆదేశించారు.
దిశ, వరంగల్ టౌన్: నిర్దేశిత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి(Mayor Gundu Sudharani), వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) అధికారులను ఆదేశించారు. సోమవారం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ (కుడా) సమావేశ మందిరంలో హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య(Collector pravinya), జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీలతో(GWMC Commissioner Ashwini Tanaji) కలిసి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్లలో పలు పథకాల కింద కుడా, జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో 15వ ఆర్థిక సంఘం నిధులు, సాధారణ నిధులు, ఎఫ్ డి ఆర్, ఫ్లడ్ డ్యామేజ్, పట్టణ ప్రగతి, గ్రీన్ ఫండ్స్, స్మార్ట్ సిటీ తో పాటు ఇతర నిధుల కింద 2023 జనవరి నుంచి నేటి వరకు చేపట్టిన అభివృద్ధి పనుల్లో పూర్తయిన, కొనసాగుతున్న, అగ్రిమెంట్, టెండర్ ప్రక్రియ, మొదలు పెట్టాల్సిన, వివిధ పనుల పురోగతి, శానిటేషన్, జంక్షన్ల అభివృద్ధి, స్వచ్చదనం పచ్చదనం, భద్రకాళి బండ్ అభివృద్ధి, మాడ వీధులు, మంచినీటి సరఫరా, శానిటేషన్, వీధి దీపాలు తదితర అంశాలపై డివిజన్ల వారీగా ఆయా శాఖల అధికారులతో కూలంకషంగా సమీక్షించి సమర్ధంగా నిర్వహించుటకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మేయర్, ఎమ్మెల్యే లు సమీక్షిస్తూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో గల డివిజన్లకు గత జనవరి 2023 నుంచి రూ. 66 కోట్ల 51 లక్షలతో 647 అభివృద్ధి పనులు మంజూరు కాగా ఇప్పటి వరకు రూ.19 కోట్ల 62 లక్షలతో 379 పనులు పూర్తయిన, రూ. 13 కోట్ల 46 లక్షల 62 పనులు పురోగతిలో ఉన్నాయని, 32 పనులకు అగ్రిమెంట్ పూర్తయినాయని, 86 పనులకు వెంటనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఇంకను మిగిలియున్న 85 పనులను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. స్వచ్చదనం పచ్చదనం లో భాగంగా కుంటలను అభివృద్ధి చేయడంతో పాటు సెంట్రల్ మీడియన్లలో ప్లాంటేషన్, డివిజన్లలో చేపట్టిన, చేపట్టాల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగులో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.
అభివృద్ధి పనులలో ఎట్టిపరిస్థితుల్లోనూ జాప్యం జరగొద్దని, టెండర్ ప్రక్రియ పూర్తయ్యి పనులు ప్రారంభించని గుత్తేదారులకు నోటీసులు జారీ చేసి తొలగించి ఇతర కాంట్రాక్టర్లచే పనులు చేయించాలని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిర్లక్ష్యాన్ని వీడి అంకితభావంతో అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. పక్షం రోజుల తర్వాత తిరిగి సమీక్షిస్తానన్నారు. ప్రత్యేక దృష్టి సాధించాలని సక్రమంగా పని చేయని కార్మికులపై చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో ప్రధాన రహదారులను వ్యాపారస్తులు ఆక్రమించుకోవడం వల్ల ట్రాఫిక్ కు, ప్రజా రవాణాకు ఇబ్బందులు కలుగుతున్న దృష్ట్యా మున్సిపల్, రెవెన్యూ, ట్రాఫిక్ పోలీసు అధికారులు సమన్వయంతో ఎంక్రోచ్మెంట్ లను తొలగించాలన్నారు. నగరంలోని కాజీపేట, సోమిరెడ్డి, గోపాలపురం ప్రాంతాల్లో తాగునీటి సక్రమంగా అందేలా చూడాలన్నారు. లీకేజీలను, అవసరమున్న చోట పైప్ లైన్ మరమ్మత్తులు ఎప్పటికప్పుడు మోటార్ల ఏర్పాటు, రిపేర్లు చేసి నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. కోతులు, కుక్కల బెడద ను తొలగించుటకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నగరంలో నూతనంగా నిర్మిస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్ లలో నిబంధనల ప్రకారం టాయిలెట్స్ పార్కింగ్ తప్పనిసరిగా ఉండేలా అధికారులు పరిశీలించాలన్నారు. శరవేగంగా పరిణితి చెందుతున్న నేపథ్యంలో నగరంలో పలు జంక్షన్లో ట్రాఫిక్ సిగ్నల్స్, గోకుల్, పెగడపల్లి డబ్బాల జంక్షన్లో రోడ్ల విస్తరణ చేపట్టాలన్నారు.
మేయర్ గుండు సుధారాణి(Mayor Gundu Sudharani) మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు పెండింగ్ లు ఉండకుండా అధికారులు చిత్తశుద్ధితో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పారిశుద్ధ్య వాహనాలను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసి చెత్త సేకరణకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. నగరంలోని రెండు, మూడు ప్రాంతాల్లో నీటి సరఫరా లో ఉన్న లోటుపాట్లను గుర్తించి సక్రమంగా నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించుటకు నియమించిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ లు క్రియాశీలంగా పనిచేయాలన్నారు. శాసన సభ్యుల సహకారంతో నగరంలో మరిన్ని జంక్షన్ లను అభివృద్ధి చేస్తామన్నారు.
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య(Collector pravinya) మాట్లాడుతూ.. స్వచ్చదనం పచ్చదనం లో భాగంగా నగరంలోని సెంట్రల్ మీడియాన్లను సక్రమంగా నిర్వహించడం తో పాటు పలు ప్రాంతాల్లో పచ్చదనం పెంచుటకు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలన్నారు. నగరంలో రోడ్లపై ఉన్న ఆక్రమణలను అధికారులు ముందస్తుగా వ్యాపారస్తులను తెలియజేసి తొలగించాలన్నారు. పారిశుద్ధ్యం బాగుండాలని, నగరమంతా ఆహ్లాదకరమైన వాతావరణంలో సుందరంగా ఉండేలా అధికారులు కృషి చేయాలన్నారు.
కమిషనర్ అశ్విని తానాజీ వాకడే(Commissioner Ashwini Tanaji Wakade) మాట్లాడుతూ.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పలు పథకాల కింద కొనసాగుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు కోతుల, కుక్కల బెడద నివారణకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో బల్దియా ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర, రాజయ్య, కుడా ఈఈ భీమ్రావు, జీడబ్ల్యూఎంసీ, ఇరిగేషన్, కుడా, ట్రాఫిక్ పోలీస్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, హార్టికల్చర్, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.