Wankidi: క‌లుషిత ఆహార ఘ‌ట‌న‌పై ఆడిష‌న‌ల్ క‌లెక్టర్ నివేదిక

కొమురంభీమ్ అసిఫాబాద్ జిల్లా వాంకిడి(Wankidi) గిరిజ‌న ఆశ్రమ బాలిక‌ల పాఠ‌శాల‌లో క‌లుషిత ఆహార ఘ‌ట‌న‌పై ఆడిష‌న‌ల్ క‌లెక్టర్ నేతృత్వంలో ఏర్పాటైన క‌మిటీ క‌లెక్టర్‌కు నివేదిక స‌మర్పించింది.

Update: 2024-11-26 09:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొమురంభీమ్ అసిఫాబాద్ జిల్లా వాంకిడి(Wankidi) గిరిజ‌న ఆశ్రమ బాలిక‌ల పాఠ‌శాల‌లో క‌లుషిత ఆహార ఘ‌ట‌న‌పై ఆడిష‌న‌ల్ క‌లెక్టర్ నేతృత్వంలో ఏర్పాటైన క‌మిటీ క‌లెక్టర్‌కు నివేదిక స‌మర్పించింది. ఈ నివేదిక‌లో మ‌ర‌ణించిన శైల‌జ ఆరోగ్య ప‌రిస్ధితిపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘ఇంత‌కు ముందే.. గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్ స‌మ‌స్యతో సీహెచ్ శైలజ చికిత్స తీసుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. దసరా సెలవుల్లో ఇలాంటి వైద్య పరీక్షల‌ కోసం ఆమె 17-10-2024న మెడికల్‌ ల్యాబ్‌కి వెళ్లింది. మల్లికార్జున డయాగ్నోస్టిక్స్ క్లినికల్ రిపోర్ట్ ప్రకారం WBC కౌంట్ స్థాయి 14,200 వ‌చ్చింది. ఇది సాధ‌ర‌ణం క‌న్నా ఎక్కువగా ఉంది. ఆమెకు ఆర్ఎంపీ డాక్టర్ పీ.చంద్రశేఖర్ చికిత్స అందించి గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్, యాంటీబయాటిక్స్ కోసం ఉపయోగించే మందులను సూచించాడు. ఆమె 21-10-2024న తిరిగి పాఠశాలకు వ‌చ్చింది. అయితే RMP డాక్టర్ సూచించిన మందులను తీసుకుంటుంది.

ఇదే క్రమంలో, అక్టోబ‌ర్ 29, 2024న క‌డుపునొప్పి, డయేరియా సింప్టమ్స్‌తో శైల‌జ‌ను ఆసుపత్రిలో చేర్చాము. పేరెంట్స్ కోరిక మేర‌కు మంచిర్యాలలోని మ్యాక్స్ కేర్ ఆసుప‌త్రిలో జాయిన్ చేసాము. ఆ త‌ర్వాత నిమ్స్‌లో చేర్చి అత్యాధునిక వైద్య చికిత్స అందిస్తున్నాము. అక్టోబ‌ర్ 29, 2024న క‌డుపునొప్పి, డయేరియా స‌మ‌స్యల‌తో 30 మంది అమ్మాయిలను ఆసుప‌త్రిలో చికిత్స అందించ‌గా అంతా కొలుకున్నారు" అని ఆద‌న‌పు క‌లెక్టర్ త‌న నివేదిక‌ను స‌మ‌ర్పించారు. కలుషిత ఆహార ఘ‌ట‌న‌కు సంబంధించి హెడ్ మాస్టర్‌తో పాటు, ఏఎన్ఎం, కుక్, ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు’ అని నివేదికలో పేర్కొన్నారు.

Tags:    

Similar News