Kharge: అదే జరిగితే సర్కార్ కూలడం ఖాయం.. ఖర్గే నోట చంద్రబాబు పేరు

కేంద్రంలోని మోడీ సర్కార్ పై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాట్ కామెంట్స్ చేశారు.

Update: 2024-11-26 11:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మరోసారి ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఓ వైపు బ్యాలెట్ విధానం పునఃప్రవేశపెట్టాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించగా మరోవైపు ఇదే బ్యాలెట్ విధానంపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జన ఖర్గే (Mallikarjuna Kharge) హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల నిర్వహణకు ఈవీఎం (EVM) లు వద్దని స్పష్టం చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో ప్రసంగించిన ఖర్గే.. బ్యాలెట్ పేపర్లే కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని వెల్లడించారు. బీజేపీ రాజ్యాంగాన్ని పొగడుతూనే లోలోపల వారు రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టార ఈ యాత్రలో ఆయనతో పాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కదిలి వచ్చారు. దాంతో మోడీని ఆపగలిగాం. లేకుంటే నరేంద్ర మోడీ (Narendra Modi) నియంతలా వ్యవహరించేవారన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి మెజార్టీ లేదని అది మైనార్టీ ప్రభుత్వం అన్నారు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), నితిష్ కుమార్ మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నదని వారు మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ ప్రభుత్వం పడిపోతుందన్నారు. 


Click Here For Video


Also Read:

CM Chandrababu Nayudu : 5 ఏళ్లలో 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్ల ఏర్పాటు : సీఎం చంద్రబాబు

Tags:    

Similar News