హైదరాబాద్‌లో 12 ఏళ్ల తర్వాత ఘనంగా ప్రారంభమైన మెగా టోర్నమెంట్..
హైదరాబాద్ మహానగరం మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కు ఆతిథ్యం అందిస్తుంది
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మహానగరం మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కు ఆతిథ్యం అందిస్తుంది. 26 నవంబర్ నుంచి డిసెంబర్ 6 వరకు జరిగే 14వ జాతీయ సబ్ జూనియర్ ఉమెన్ నేషనల్ చాంపియన్‌షిప్(Sub Junior Women National Championship) 2024కు హైదరాబాద్(Hyderabad) వేదిక అయ్యింది. దాదాపు హైదరాబాద్ లో 12 ఏళ్ల తర్వాత మెగా టోర్నమెంట్ తెలంగాణ రాజధాని నగరంలో జరుగుతుండటం విశేషం. కాగా ఈ హాకీ పోటీ(Hockey competitions)లను విజయవంతంగా నిర్వహించేందుకు హాకీ క్రీడా సంఘానికి తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ(Telangana Sports Authority) సహకారం అందజేస్తుంది. కాగా ఈ 14వ హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్ షిప్ 2024 ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. కాగా ఈ టోర్నీకి సంబంధించిన గేమ్స్.. సికింద్రాబాద్లోని ఆర్ఆర్‌సీ మైదానంలో జరగనున్నాయి. 26 నవంబర్ నుంచి డిసెంబర్ 6 వరకు జరిగే ఈ పోటీల్లో మొత్తం 29 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీ నిర్వహణ ద్వారా తెలంగాణ క్రీడాకారుల్లో నూతన ఉత్సాహం తీసుకురావడమే లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుందని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు.
ఈరోజు జరిగిన మ్యాచ్‌లు
1) జార్ఖండ్ వర్సెస్ తెలంగాణ
2) తమిళనాడు వర్సెస్ ఒడిశా
3) ఉత్తరప్రదేశ్ వర్సెస్ రాజస్థాన్
4) మహారాష్ట్ర వర్సెస్ అస్సాం
5) కర్ణాటక వర్సెస్ ఢిల్లీ మ్యాచులు పూర్తయ్యాయి.
రేపటి మ్యాచ్‌ల వివరాలు
1) తెలంగాణ వర్సెస్ చత్తీస్ ఘడ్
2)హిమాచల్ ప్రదేశ్ వర్సెస్ తమిళనాడు
3)ఉత్తరాఖండ్ వర్సెస్ ఉత్తర ప్రదేశ్
4)గుజరాత్ వర్సెస్ అస్సాం
5)మధ్యప్రదేశ్ వర్సెస్ బెంగాల్
6) ఢిల్లీ వర్సెస్ జమ్మూ కాశ్మీర్