WGL: చిన్నారిని చూసి చలించిపోయిన మంత్రి కొండా సురేఖ (వీడియో)
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) గొప్ప మనసు చాటుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) గొప్ప మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం వరంగల్ నుంచి పెద్దపల్లి వైపు మంత్రి వెళ్తున్నారు. ఈ క్రమంలో సుల్తానాబాద్ మార్కెట్ చౌరస్తా(Sultanabad Market Square) వద్ద రోడ్డుపై చెప్పులు లేకుండా వెళ్తున్న ఒక బిహార్(Bihar) పాపను చూసి చలించిపోయారు. వెంటనే తన కాన్వాయ్‌ని ఆపి, సిబ్బందితో పక్కనే చెప్పుల దుకాణం వద్దకు వెళ్ళి ఆ చంటి పాపకు చెప్పులు కొని ప్రత్యేకంగా అందజేశారు. ఆ పసి పాపకు బట్టలు కూడా కొనిచ్చి మంత్రి సురేఖ మానవత్వాన్ని చాటుకున్నారు.