CM Chandrababu: పద్ధతి ప్రకారం పని చేయడం నేర్చుకోండి.. అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్

తొక్కిసలాట (Stampede) ఘటనలో క్షతగాత్రులను పరామర్శించేందుకు ఇవాళ సీఎం చంద్రబాబు (CM Chandrababu) తిరుపతి (Tirupati)కి చేరుకున్నారు.

Update: 2025-01-09 08:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: తొక్కిసలాట (Stampede) ఘటనలో క్షతగాత్రులను పరామర్శించేందుకు ఇవాళ సీఎం చంద్రబాబు (CM Chandrababu) తిరుపతి (Tirupati)కి చేరుకున్నారు. ముందుగా ఆయన తొక్కిసలాట బైరాగిపట్టెడ (Bairagipatteda) ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ క్రమంలోనే అయన టీటీడీ ఈవో (TTD EO), కలెక్టర్ (Collector), ఎస్పీ (SP), అధికారుల (Officers)పై సీరియస్ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏదైన ఒక పని బాధ్యత తీసుకున్న వారు సక్రమంగా నెరవేర్చాలని అన్నారు. ఇక నంచి అయినా.. పద్ధతి ప్రకారం పని చేయడం నేర్చుకోవాలని హితవు పలికారు. టోకెన్లు జారీ చేసే కౌంటర్ వద్ద 2 వేల మంది మాత్రమే పడితారని అనుకున్నప్పుడు 2,500 మందిని ఎలా లోనికి పంపించారని అధికారులను ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో స్పందించిన అధికారులు భక్తులు కూర్చున్నప్పుడు పరిస్థితి అంతా బాగానే ఉందని తెలిపారు. బయటకు వదిలేప్పుడు ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పిందని సీఎంకు వివరణ ఇచ్చారు. దీంతో సీఎం చంద్రబాబు ‘నో ఎక్స్‌ప్లనేషన్స్’ అంటూ వారిపై సీరియస్ అయ్యారు.  

Full View

Tags:    

Similar News