MLC Balmoor Venkat : మాజీ మంత్రి కేటీఆర్ పై ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఫైర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా గుర్తింపు పొందారని, ఫార్ములా ఈ రేసు కేసులో సుప్రీంకోర్టు, హైకోర్టులలో ఊరట లభించకపోవడంతో మతిస్థిమితం కోల్పోయి ప్రభుత్వంపైన, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పైన విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరీ వెంకట్(MLC Balmoor Venkat) మండిపడ్డారు
దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా గుర్తింపు పొందారని, ఫార్ములా ఈ రేసు కేసులో సుప్రీంకోర్టు, హైకోర్టులలో ఊరట లభించకపోవడంతో మతిస్థిమితం కోల్పోయి ప్రభుత్వంపైన, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పైన విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరీ వెంకట్(MLC Balmoor Venkat) మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆర్థిక, రాజకీయ అంశాలను చేర్చి దోపిడీకి తెరలేపిందే కేటీఆర్ అని విమర్శించారు.
కేటీఆర్ చేసిన అక్రమాలకు ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏసీబీకి పూర్తిస్థాయిలో సహకరించి నీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలన్నారు. కరీంనగర్ అక్రమ ఇసుక రవాణా చేసింది మీ తమ్ముడు, మీ బాబాయ్ కాదా అని కేటీఆర్ ను ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ లో చెల్లె కవిత ఇరుక్కుని ఊచలు లెక్క పెట్టింది నిజం కాదా అని నిలదీశారు. ప్రభుత్వ శాఖల్లో కేటీఆర్ చేసిన అవినీతి చిట్టాను ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తున్నామన్నారు.
బీఆర్ ఎస్ ప్రభుత్వం ఏ స్కీమ్ తీసుకువచ్చిన స్కామ్ కే దారి తీసిందన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో బావ, బామ్మర్ది ఎన్నో స్కామ్ లకు పాల్పడ్డారని, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో అడ్డమైన జీవోలు ఇచ్చి ప్రభుత్వ భూములను ప్రైవేటు రంగానికి, బిల్డర్లకు ఇచ్చి డబ్బులు దోచుకు తిన్నారన్నారు. చత్తీస్గడ్ లో అదానీతో కేసీఆర్ చేసుకున్న అక్రమ ఎలక్ట్రిసిటీ ఒప్పందాల సంగతేంటని ప్రశ్నించారు.
కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురైందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు కేటీఆర్ కు లేదన్నారు. దోపిడీకి పాల్పడిన కేటీఆర్ కుటుంబాన్ని తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదన్నారు. కేటీఆర్ కు హైదరాబాద్ పై ఒక స్పష్టత లేదన్నారు. ఐటీ రంగంలో హైదరాబాదును అభివృద్ధి చేశామని ఒక బోగస్ ప్రచారానికి కేటీఆర్ తెరలేపిండని ఆరోపించారు.