మండలాన్ని అభివృద్ధి బాటలో తీర్చిదిద్దుతాం : కడియం శ్రీహరి

రఘునాథపల్లి మండలం అంటే నాకెంతో అభిమానమని, మండలాన్ని అభివృద్ధి బాటలో తీర్చిదిద్దుతామని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి బాటలో నడుస్తుందని మాజీ ఉపముఖ్యమంత్రి స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

Update: 2024-11-26 09:20 GMT

దిశ, జనగామ : రఘునాథపల్లి మండలం అంటే నాకెంతో అభిమానమని, మండలాన్ని అభివృద్ధి బాటలో తీర్చిదిద్దుతామని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి బాటలో నడుస్తుందని మాజీ ఉపముఖ్యమంత్రి స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం రఘునాథపల్లి మండలం కొమ్మల గ్రామంలో గ్రామపంచాయతీ భవన శంకుస్థాపన, సీసీ రోడ్డు, అంగన్వాడి భవనం పనులకు రూ. 55 లక్షలతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని డా. బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జరిగిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ మేకల నరేందర్ వరలక్ష్మి అధ్యక్షత వహించగా ఆయన పాల్గొని మాట్లాడుతూ… రఘునాథపల్లి మండలాన్ని అభివృద్ధి పథంలో తీర్చిదిద్దేందుకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏడాది కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి శభాష్ అనిపించుకుందని, త్వరలో విజయోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు .రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్తకు పార్టీలో న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బోల్లపల్లి కృష్ణ , జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు... మాజీ జెడ్పిటిసి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మేకల వరలక్ష్మి నరేందర్, జనగామ మార్కెట్ డైరెక్టర్లు గాదే రమేష్ పటేల్, తోటకు ర్ రమేష్ యాదవ్... మహమ్మద్ భాష్మియా... మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోళ్ల రవి గౌడ్ జనగామ జిల్లా నాయకులు లింగాజీ, గాదేమహేందర్రెడ్డి, పోకల శివకుమార్ గుప్తా, గ్రామ శాఖ అధ్యక్షులు బోల్లపెల్లి కుమారస్వామి, డాక్టర్ సుమన్, జనగామ డివిజన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News