మరికొన్ని గంటల్లో విగ్రహావిష్కరణ.. ఆపాలంటూ నోటీసులు..

మండల కేంద్రంలో మంగళవారం మరికొన్ని గంటల్లో (12.30)కి మంత్రి సీతక్క చేతుల మీదుగా ఆవిష్కరణ చేయనున్న భారతరత్న బీఆర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణను ఆపాలని జాతీయ మానవ హక్కుల సంఘం ఒక ప్రకటనలో ఆదేశించింది.

Update: 2024-11-26 05:42 GMT

దిశ, మంగపేట : మండల కేంద్రంలో మంగళవారం మరికొన్ని గంటల్లో (12.30)కి మంత్రి సీతక్క చేతుల మీదుగా ఆవిష్కరణ చేయనున్న భారతరత్న బీఆర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణను ఆపాలని జాతీయ మానవ హక్కుల సంఘం ఒక ప్రకటనలో ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలానికి చెందిన తెలంగాణ మాల మహానాడు జిల్లా నాయకుడు చిట్టిమల్ల సమ్మయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొందరు మాల మహానాడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అర్థరాత్రి ఆ విగ్రహాన్ని తొలగించి అదే స్థానంలో మరో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుకు యత్నించడాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్, హైకోర్టు లాయర్ గడిపే ప్రశాంత్ కు ఫిర్యాదు చేశారు.

దీంతో సమీక్షించిన జాతీయ మానవ హక్కుల సంఘం 26న మంత్రి సీతక్క చేతుల మీదుగా ఆవిష్కరించే డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణను ఆపేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరికొన్ని గంటల్లో మంత్రి సీతక్క విగ్రహావిష్కరణ చేయనున్న తరుణంలో ఆదేశాలు రావడం పట్ల అయోమయం నెలకొంది. చిట్టిమల్ల సమ్మయ్య ఫిర్యాదు మేరకు మండల కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి, బండ జగన్మోహన్ రెడ్డి, మాసిరెడ్డి వెంకట్ రెడ్డి, సూర్య, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, యం పల్లి సమ్మయ్య, బసారికారి హరికృష్ణ, కర్రి నాగేంద్రబాబు, జంగం భానుచందర్, ఎడ్ల నరేష్, యం పల్లి వీరస్వామి, బీఆర్ఎస్ నాయకుడు రాజమల్ల సుకుమార్, ఇతర నాయకులకు జాతీయ మానవహక్కుల సంఘం నోటీసులు జారీ చేసినట్లు చిటిమల్ల సమ్మయ్య ప్రకటనలో తెలిపారు.


Similar News