సీఐ వాహనాన్ని ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం..

మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ జంక్షన్ వద్ద, సీఐ మల్లేష్ ఇన్నోవా వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో, దంపతులకు స్వల్ప గాయాలయ్యాయి.

Update: 2024-10-04 17:04 GMT

దిశ, చిట్యాల : మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ జంక్షన్ వద్ద, సీఐ మల్లేష్ ఇన్నోవా వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో, దంపతులకు స్వల్ప గాయాలయ్యాయి. మండలంలోని నైన్ పాక గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా, సీఐ నైన్పాక గ్రామానికి తన వాహనంలో బయలుదేరారు. ఎమ్మార్వో ఆఫీస్ జంక్షన్ వద్ద సీఐ వాహనాన్ని, గర్మిళ్లపెళ్లికి వెళ్తున్న ఇద్దరు దంపతుల ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనం పై ఉన్న ఇద్దరికీ కింద పడడంతో, స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే స్థానికంగా చికిత్స జరిపి, మెరుగైన వైద్యం కోసం హనుమకొండకు పంపించారు. ఇన్నోవా కార్లో కూర్చున్న సీఐకి స్వల్ప గాయాలు అయ్యాయి.


Similar News