అటవీ శాఖ భూములలో నిర్మించిన గుడిసెలను కూల్చివేసిన అధికారులు..
అటవీ శాఖ భూములలో అక్రమంగా నిర్మించిన 60 గుడిసెలను అటవీ శాఖ అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య తొలగించిన ఘటన ఏటూరునాగారం మండలం శంకర్ రాజ్ పల్లి గ్రామ సమీపంలో జరిగింది.
దిశ, ఏటూరునాగారంః - అటవీ శాఖ భూములలో అక్రమంగా నిర్మించిన 60 గుడిసెలను అటవీ శాఖ అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య తొలగించిన ఘటన ఏటూరునాగారం మండలం శంకర్ రాజ్ పల్లి గ్రామ సమీపంలో జరిగింది. అటవీ శాఖ అధికారుల కథనం మేరకు .. రొయ్యూరు నుండి చల్పాకకు వెళ్లే ప్రధాన మార్గం పక్కన (శంకర్ రాజ్ పలి బీట్) రోహీర్, శంకరాజుపల్లి గ్రామస్తులు అటవీ శాఖ భూములలో గుడిసెలు నిర్మించుకున్నారని, గుడిసెలు వేసుకున్న వారికి పలుమార్లు తొలగించాలని నోటీసులు సైతం అందివ్వడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు పలుమార్లు నోటీసులు అందించిన గుడిసెలు తొలగించక పోవడంతో సోమవారం రోజున పోలీసు బందోబస్తు మధ్య సుమారు 60 గుడిసెలను జేసీబితో తొలగించినట్లు అటవీ శాఖ అధికారి అభ్దుల్ రేహమాన్ తెలిపారు. కానీ భాదితులు మేము గత ఇరవై యేళ్ళుగా పోడు కొట్టుకుని ఇక్కడే బ్రతుకుతున్నామని, ఏకరాల భూములు అక్రమించలేదని మా ఇళ్లను ధ్వంసం చేయడం అన్యాయం అని, మా గోడు పట్టించుకుని మాకు న్యాయం చేయాలని భాదితులు వేడుకుంటున్నారు.