కమీషన్ 'రగడ' .. కొట్టుకున్న హెడ్ కానిస్టేబుళ్లు..!

ఫిర్యాదు దారుడి నుండి తీసుకున్న లంచాన్ని సమంగా పంచలేదని ఆరోపిస్తూ ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు కొట్టుకున్న సంఘటన నెక్కొండ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకున్నట్లు సమాచారం.

Update: 2024-11-04 07:36 GMT

దిశ, నెక్కొండ : ఫిర్యాదు దారుడి నుండి తీసుకున్న లంచాన్ని సమంగా పంచలేదని ఆరోపిస్తూ ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు కొట్టుకున్న సంఘటన నెక్కొండ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకున్నట్లు సమాచారం. వాటాల్లో వచ్చిన తేడా ప్రధానంగా గొడవకు కారణంగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కొన్ని రోజుల కిందట నెక్కొండ ఎస్సై లీవ్ పై వెళ్లారు. ఈ నేపథ్యంలో స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుల బాధ్యతలను ఓ హెడ్ కానిస్టేబుల్ కి అప్పజెప్పినట్లు చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలోనే మరో హెడ్ కానిస్టేబుల్ సైతం ఆధిపత్యం చేయడంతో ఇరువురి మధ్య డబ్బుల సమస్య తలెత్తింది. కళ్లెదుటే కమీషన్ పోతుండటంతో ఆగ్రహం చెందిన సదరు హెడ్ కానిస్టేబుల్ తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఇది కాస్త ముదరడంతో పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాల వేదికగా ఇరువురు కొట్లాటకు దిగినట్లు సమాచారం. అందుబాటులో ఎస్సై లేకపోవడంతో సమాచారం అందుకున్న సీఐ చంద్రమోహన్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మండల వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే కమీషన్ల కోసం బహిరంగంగా కొట్టుకోవడం విమర్శలకు కారణమైంది. ఈ ఘటన పై ఉన్నతాధికారులు విచారణ చేసి ఏ మేరకు చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News