అక్రమార్కుల చేతిలో మోసపోతున్న అమాయకులు..

ప్రతి శనివారం గీసుగొండ మండలంలోని కొమ్మలలో అంగడి నిర్వహిస్తారు. మండలంలోని చుట్టుపక్కల గ్రామాలు పక్క మండల గ్రామాలలోని వారు పశువులను గొర్రెలను అమ్మడానికి కొనడానికి వేల సంఖ్యలో ఈ అంగడికి వస్తుంటారు.

Update: 2025-01-04 09:05 GMT

దిశ, గీసుగొండ : ప్రతి శనివారం గీసుగొండ మండలంలోని కొమ్మలలో అంగడి నిర్వహిస్తారు. మండలంలోని చుట్టుపక్కల గ్రామాలు పక్క మండల గ్రామాలలోని వారు పశువులను గొర్రెలను అమ్మడానికి కొనడానికి వేల సంఖ్యలో ఈ అంగడికి వస్తుంటారు. ఇదే అదునుగా చూసుకున్న కొంతమంది అక్రమార్కులు ఐదు నుంచి ఆరుగురు కలిసి తడాట ఆడిస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. కొమ్మల అంగడిలో గోర్లు మకాల జరిగే చోట టేబుల్ వేసుకొని ఎలాంటి బెరుకు లేకుండా యదేచ్ఛగా తడాట ఆడిస్తున్న కేటుగాలను దిశ రిపోర్టర్ ఫోటోలు తీస్తుండగా సెల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు.

ఈ తడాట పై టెండర్ దారులను అడగగా తెలిసినప్పటికీ తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఆట గురించి తెలియక అమాయకులు కేటుగాళ్ల మోసాలకు బలవుతున్నారు. పోలీసుల నిఘా లేకపోవడంతో కేటుగాళ్ల పని యదేచ్ఛగా సాగుతుంది. పోలీసు అధికారులు కొమ్మల అంగడిలో దృష్టి సారించి కేటుగాళ్ల పనిపట్టి అమాయకులను రక్షించాలంటున్నారు అంగడికి వస్తున్న వారు.


Similar News