కేసముద్రం కాంగ్రెస్ లో కల్లోలం..

కేసముద్రం కాంగ్రెస్ లో అసంతృప్తి సెగలు లోలోన ఉడుకుతున్నాయి. అని మండలంలో జరుగుతున్న సన్నివేశాలు బహిర్గతం చేస్తున్నాయి.

Update: 2025-01-06 08:01 GMT

దిశ, కేసముద్రం : కేసముద్రం కాంగ్రెస్ లో అసంతృప్తి సెగలు లోలోన ఉడుకుతున్నాయి. అని మండలంలో జరుగుతున్న సన్నివేశాలు బహిర్గతం చేస్తున్నాయి. ఎంతో కాలంగా పార్టీని పట్టుకుని, పార్టీ ఆపద సమయంలో కూడా వెన్నంటి వున్న కార్యకర్తలను పక్కన పెట్టి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వటం పట్ల పార్టీ సీనియర్లు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.

సీన్ రిపీట్..

గతంలో మార్కెట్ కమిటీ సమయంలో తమకు పోస్టులు వస్తాయని భావించినా కొందరికి అవి రాకపోవటం వలన మండల పార్టీ రెండుగా చీలిపోయినట్టు కనిపించింది. మళ్ళీ ఇప్పుడు కొన్ని నామినేటెడ్ పోస్ట్ లలో కూడా తమ పేరు లేకపోవడం వల్ల మనస్తాపానికి గురైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు కూడా తమకు న్యాయం జరుగక పోతే పార్టీని వెన్నంటి ఉండి లాభం ఏముంది అని సదరు నాయకులు సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలుస్తుంది. తమకు నామినేటెడ్ పోస్టులు రాక పోవటం పట్ల మనస్తాపానికి గురై.. టెంట్ వేసి నిరసన తెలపటానికి కొంతమంది సిద్ధం అవ్వగా... విషయం తెలుసుకున్న ఎంఎల్ఏ వారిని పిలిపించి బుజ్జగించినట్టు సమాచారం.. ఇంతటితో ఈ అసమ్మతి తగ్గినట్టా లేక నివురు గప్పిన నిప్పులా వుంటుందా కాలమే చెప్పాలి.


Similar News