మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అరెస్ట్..
మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ను సోమవారం అరెస్ట్ చేశారు.
దిశ, హనుమకొండ : మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ను సోమవారం అరెస్ట్ చేశారు. అన్నదాతకు అండగా రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిరసనగా కాళోజీకి వినతిపత్రం అందించేందుకు వెళ్తుండగా పార్టీ కార్యాలయంలో నిర్బంధించే ప్రయత్నం చేశారు. పోలీసులను ప్రతిఘటించిన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ దాదాపు గంట పాటు పోలీసులను నిర్బంధించే ప్రయత్నం చేయగా, కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్సై, సీఐలు, ఏసీపీ, డీఐజీ స్థాయి వరకు అధికారుల పహారా కాచి అడ్డగించి అక్రమ అరెస్ట్ చేసి కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు.