కడియం.. జాగ్రత్త బిడ్డా.. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే పై పల్లా ఫైర్...
ఊసరవెళ్లి కడియంకు గోరి కడతం.. శ్రీహరి పొద్దు తిరుగుడు పువ్వొసంటోడు.. పదవి పిచ్చోడు. ఏపార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్తాడు..
దిశ, జనగామ : ఊసరవెళ్లి కడియంకు గోరి కడతం.. శ్రీహరి పొద్దు తిరుగుడు పువ్వొసంటోడు.. పదవి పిచ్చోడు. ఏపార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్తాడు.. ఆయన బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పైసలతో సహా వెళ్లి మోసం చేసిండు.. గులాబీ జెండా కింద గెలిచిన ఆయనకు ఏ మాత్రం సిగ్గు శరం ఉన్నా వెంటనే రాజీనామా చేయాలి" అని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధి దారులకు పల్లా సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ముందుగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రజలందరికి ఈ వచ్చే ఏడాదిలో సాగు నీరందాలి, విద్య, వైద్యంలో మంచి ప్రగతిని సాధించాలి. ఏడాది కాలంలో దాదాపు 1000 పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను పేదప్రజలకు అందించాం.. కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో ఏ ఒక్కరోజు ఆలస్యం కాకుండా ప్రభుత్వం ద్వారా అందించాం అన్నారు.
వ్యక్తిగతంగా వైద్యం విషయంలో నీలిమ హాస్పిటల్ ద్వారా వందలాది మందికి సేవలందించాం. కొంతమంది రాజకీయంగా కేసీఆర్ పెట్టిన భిక్షతో ఎన్నికైన వారు కారు కూతలు కూస్తున్నారు. స్టేషన్ ఘన్ పూర్, జనగామ నియోజకవర్గం జనగామ జిల్లాలోనే ఉందిన్నారు. జనగామ జిల్లా మొదటి నుంచి ఉద్యమాలకు ఊతంగా ఉంది.. ఉద్యమాల్లో పాల్గొన్నవారినే ఎక్కువగా గెలిపించింది. దురదృష్టవశాత్తు నమ్మబలికి కేసీఆర్ పక్కన, బీఆర్ఎస్ లో చేరితే కడియం శ్రీహరిని నాయకులు, ప్రజలంతా కష్టపడి గెలిపించారు. ఊసర వెల్లి సిగ్గు పడేలా అధికారం ఎలా ఉంటే అలా పొద్దు తిరుగుడు పువ్వులా తిరుగుతూ ఉంటాడన్నారు. అలాంటి వ్యక్తి నిన్న కేసీఆర్, కేటీఆర్, కవిత పై ఇష్టం వచ్చినట్లు అవాకులు, చెవాకులు కూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం నీకు సిగ్గు శరం ఉంటే రాజీనామా చేసి గెలవాలి.. నీకు రెండు సార్లు అవకాశం ఇచ్చింది కేసిఆర్ కదా.. నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పైసలతో వెళ్లి మోసం చేసింది నువ్వు కాదా.. నీకు డిప్యూటీ సీఎం ఇస్తే మొత్తం నీ కుటుంబానికి పెంచి పోషించావ్ తప్ప.. నీతులు చెపుతూ గోతులు తవ్వావు. నీలాంటి వాళ్లకు ఉప ఎన్నిక వస్తది.. నిన్ను పాతర పెట్టడం ఖాయం కేసీఆర్ పక్కన ఉన్నప్పుడు అంత పొగుడుడే.. కేటీఆర్ ను పొగుడుడే.. గతంలో నియోజకవర్గ మొత్తానికి ఏ పనులు చేయకుండా అడ్డుకున్నాడు.
40 ఏళ్ల రాజకీయం అంటున్నావు..ఒక్క డిగ్రీ కాలేజ్ అయినా తెచ్చావా అని అడుగుతున్నా.నేను తీసుకువచ్చిన ఎత్తిపోతలకు కొబ్బరి కాయ కొడ్తావా.. సిగ్గు శరం ఉండాలి...రాజీనామా చేసి గెలిచి అవసరం ఉంటే అప్పుడు కొట్టు..కేసీఆర్ మీద మాట్లాడే మొనగాడివి కాదు నువ్వు..మా ప్రజల దయాదాక్షిణ్యాలు, పార్టీ జెండాతో కింద గెలిచావు.మా నాయకులు దగ్గర నుంచి టికెట్ లు పొందావ్.. పదవులు పొందావ్. అధికారం అనుభవించావ్. ఇవ్వాల నీతులు మాట్లాడితే జాగ్రత్త బిడ్డా.. రాజకీయంగా చివరి దశకు వచ్చావు.నీ వయసు సహకరించడం లేదు..ఏం మాట్లాడుతున్నావో..జాగ్రత్త అని బీఆర్ఎస్ తరుపున హెచ్చరిస్తున్నాం.. జనగామ, స్టేషన్ ఘన్ పూర్ ప్రజలంతా నీలాంటి ఊసరవెళ్లులకు గోరి కడతాం..ఎన్నికల్లో దగ్గరికి వస్తున్నాయని మీటింగ్స్ పెడుతున్నారు. ఏం చేశారని ఎన్నికలు పెడతావు..ప్రజలు మిమ్మల్ని పాతర పెట్టడం, శంకర గిరి మాన్యాలకు పట్టడం ఖాయమని హెచ్చరిస్తున్నా..ఏడాది కాలంగా నాయకులు కార్యకర్తలు ఏ విధంగా కష్టపడి పని చేశారో అదే విధంగా ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటున్నా..వచ్చే ఎన్నికల్లో మీ అందరినీ పాతర పెట్టడం ఖాయం అని హెచ్చరించారు.