వలకు చిక్కిన వింత చేప

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల పరిధి రాముతండా చెరువులో బానోతు హనుమంతు శనివారం చేపల వేటకు వెళ్లాడు

Update: 2025-01-04 16:25 GMT

దిశ,డోర్నకల్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల పరిధి రాముతండా చెరువులో బానోతు హనుమంతు శనివారం చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో వలకు వింత చేప చిక్కింది. సుమారు అరకేజీ బరువు ఉన్నట్లు తెలిపారు. ఈ రకం చేపలు సముద్రంలో ఉంటాయని అంటున్నారు. చేప మనిషి ముఖం పోలి ముక్కు,చెవులు ఉన్నాయని అంటున్నారు. ఈ వింత చేపను చూడటానికి తండావాసులు తండోపతండాలుగా తరలి వచ్చారు.


Similar News