యూరియా కోసం అన్నదాత పడిగాపులు..
యాసంగి సీజన్లో మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు మొక్కజొన్న
దిశ,నెక్కొండ: యాసంగి సీజన్లో మండలవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారు.యూరియా బస్తాలకు భారీగా డిమాండ్ పెరిగింది.రైతులు సోమవారం ఉదయం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం బారులు తీరారు.200 టన్నుల యూరియా అవసరం ఉండగా,సొసైటీలో 550 బస్తాలు మాత్రమే అందుబాటులో ఉండడంతో రైతులు అరకొరగా బస్తాలు తీసుకొని వెనుదిరిగారు.ఓ పక్క మొక్కజొన్న,మరో పక్క వరి నాట్లు వేస్తుండడంతో సరిపడా యూరియా బస్తాలు అందుబాటులో ఉంచాలని రైతులు అధికారులను డిమాండ్ చేశారు.