నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధే త‌న ధ్యేయ‌మ‌ని మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి అన్నారు.

Update: 2025-03-15 16:43 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధే త‌న ధ్యేయ‌మ‌ని మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి అన్నారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రూ. 800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయ‌డానికి వస్తున్న నేపథ్యంలో శివునిప‌ల్లి వ‌ద్ద‌ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను వ‌రంగ‌ల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తో కలిసి క‌డియం శ్రీహ‌రి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క‌డియం శ్రీహ‌రి మాట్లాడారు. ఆదివారం మధ్యాహ్నం 12:00 గంటలకు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రం శివునిపల్లి లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ సందర్బంగా 50 వేల మందితో భారీ కృతజ్ఞత సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

     ఈ సభను నియోజకవర్గ ప్రజలు, మహిళలు, రైతులు, యువకులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి జయప్రదం చేయాలని క‌డియం కోరారు. శంకుస్థాపనలు చేయనున్న అభివృద్ధి పనులకు టెండర్లు పూర్త‌యి అగ్రిమెంట్లు కూడా అయ్యాయని, శంకుస్థాపన చేసిన వెంటనే పనులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ప్రారంభమైన పనులను 18 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు. ఒక్క ఏడాదిలోనే స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 800 కోట్ల పైచిలుకు నిధులు కేటాయించారని అన్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఏ నియోజకవర్గానికి నిధులు మంజూరు కాలేదని అన్నారు. ఇది స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలపై సీఎం ప్రేమకు నిదర్శనమని తెలిపారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అడిగిన వెంటనే కాదనకుండా నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికి భారీ జన సమీకరణతో కృతజ్ఞతలు తెలపనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సభలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  

Read More..

బంగారం షాప్ ఓనర్లను బురిడీ కొట్టించిన నకిలీ పోలీసులు.. 

సివిల్ తగాదాల్లో తల దూర్చొద్దు : ఎస్పీ 


Similar News