TG: ఎంత రాత్రి అయినా సరే.. పని పూర్తయ్యాకే హైదరాబాద్‌కు వెళ్తాం.. మంత్రుల ప్రకటన
హన్మకొండ జిల్లా హసన్‌పర్తి వద్దనున్న దేవాదుల ప్రాజెక్టు(Devadula Project) మూడోదశ ఎత్తిపోతల పంప్‌హౌజ్ ప్రారంభానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: హన్మకొండ జిల్లా హసన్‌పర్తి వద్దనున్న దేవాదుల ప్రాజెక్టు(Devadula Project) మూడోదశ ఎత్తిపోతల పంప్‌హౌజ్ ప్రారంభానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మంగళవారం పంప్‌హౌజ్‌లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) పూజలు చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా పంపులు ఆన్ చేయలేకపోయారు. ప్రస్తుతం సమస్యను పరిష్కరించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాత్రి ఎంత ఆలస్యం అయినా సరే.. పంపులు ఆన్ చేశాకే హైదరాబాద్‌కు వెళ్తామని మంత్రులు ఇద్దరు అక్కడే తెగేసి కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేస్తామని కీలక ప్రకటన చేశారు.
18 నెలల్లోనే పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని అన్నారు. గత పాలకులకు దేవాదులను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. కీలకమైన పాత ప్రాజెక్టులను పక్కకు నెట్టి.. జేబులు నింపుకునేందుకు కొత్త కట్టారని ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనుకున్న దాని కంటే రైతులు ఎక్కువ సాగు చేశారని తెలిపారు. రైతుల పంటల ఎండిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నాం.. బడ్జెట్ సమావేశాల కంటే రైతుల సమస్యలే ముఖ్యమని వచ్చాం.. ఎంత పొద్దుపోయినా పంపు ఆన్ చేసి వెళతాం.. నాటి ప్రభుత్వం దేవాదుల పూర్తి చేసి ఉంటే రైతులకు ఈ స్థితి వచ్చేది కాదు అన్నారు.