Betting Apps Promotion : సినీ నటుడు అలీ సతీమణిపై అనుమానం..?
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో సినీ నటుడు అలీ సతీమణి జుబేదా ఉన్నట్లు తమకు అనుమానం కలుగుతోందని జనసేన విద్యార్థి విభాగం సంపత్ నాయక్ అన్నారు

దిశ, వెబ్ డెస్క్: బెట్టింగ్ యాప్స్(Betting Apps) ప్రమోషన్‌లో సినీ నటుడు అలీ సతీమణి జుబేదా(Film actor Ali wife Zubeida)తో పాటు బిగ్ బాస్ 4 ఫేమ్ యాంకర్ లాస్య(Anchor Lasya) ఉన్నట్లు తమకు అనుమానం కలుగుతోందని జనసేన విద్యార్థి విభాగం సంపత్ నాయక్ అన్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారంటూ జబర్దస్త్ వర్ష, హర్షసాయిపై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంపత్ నాయక్ మాట్లాడుతూ జుబేదా అలీ, లాస్య యూట్యూబ్ ఛానల్స్‌ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జుబేదా అలీ, లాస్యతో పాటు పలువురిపై ఈ మధ్య కాలంలో మియాపూర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. జుబేదా యూట్యూబ్ చానళ్లు, గూగుల్‌లో వాళ్ల ఫొటోలు రావడంలేదని, దీంతో వాళ్లపై తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. జుబేదా అలీ, లాస్య యూట్యూబ్ చానళ్లను పోలీసులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని సంపత్ నాయక్ కోరారు.