జయ నర్సింగ్‌ కాలేజీ సీజ్‌

మూడేళ్లుగా మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఆస్తి పన్ను చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జయ నర్సింగ్‌ కాలేజీ యాజమాన్యంపై వరంగల్‌ మహానగర పాలక సంస్థల అధికారులు చర్యలు తీసుకున్నారు.

Update: 2025-03-18 13:44 GMT
జయ నర్సింగ్‌ కాలేజీ సీజ్‌
  • whatsapp icon

దిశ, వరంగల్‌ టౌన్ : మూడేళ్లుగా మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఆస్తి పన్ను చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జయ నర్సింగ్‌ కాలేజీ యాజమాన్యంపై వరంగల్‌ మహానగర పాలక సంస్థల అధికారులు చర్యలు తీసుకున్నారు. కాలేజీని మంగళవారం సీజ్‌ చేశారు. మూడేళ్లుగా హన్మకొండలోని జయ నర్సింగ్‌ కాలేజీ యాజమాన్యం రూ. 44 లక్షల ఆస్తి పన్ను చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని బల్దియా డిప్యూటీ కమిషనర్‌ రవీందర్‌ తెలిపారు.

    కోర్టులో కేసు కొనసాగుతుందని చెబుతూనే నర్సింగ్‌ కళాశాలను నడుపుతున్నారని గుర్తించిన బల్దియా పన్నుల అధికారులు బకాయి పన్నులు చెల్లించాలని రెడ్‌ నోటీస్‌ జారీ చేసినట్లు తెలిపారు. అయినా యాజమాన్యం స్పందించకపోవడంతో మంగళవారం ఉదయం కాలేజీ నుంచి విద్యార్థులను, సిబ్బందిని బయటికి పంపించి సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. పన్ను చెల్లించిన సుమారు 356 ప్రాపర్టీలను గడిచిన వారం రోజుల్లో సీజ్‌ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఓయూ సుఫోద్ధిన్‌, ఆర్‌ఐలు సురేష్‌, రజని, భరత్‌చంద్ర, శ్రీకాంత్‌, బిల్‌ కలెక్టర్లు పాల్గొన్నారు. 

Similar News