Tatikonda Rajaiah : రేవంత్ పాలన అట్టర్ ప్లాప్ : తాటికొండ రాజయ్య
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Ex MLA Tatikonda Rajaiah) మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Ex MLA Tatikonda Rajaiah) మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం స్టేషన్ ఘనపూర్లో(Station Ghanpur) జరిగిన ప్రజాపాలన విజయోత్సవాలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదని అట్టర్ ప్లాప్ పాలన అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు స్టేషన్ ఘనపూర్ కి ఏమీ చేయలేదనడం విడ్డూరంగా ఉందని, ఏమీ చేయకుండానే బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద కడియం గెలిచారా అని ప్రశ్నించారు.
దమ్ముంటే కడియం శ్రీహరి(Kadiyam Srihari) రాజీనామా చేసి, ప్రజల ముందుకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. స్టేషన్ ఘనపూర్లో ఉపఎన్నికలు(By Poll) రావడం తథ్యమని, అందుకే రేవంత్, కడియం హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్టు, రైల్వే డివిజన్ ఇస్తే.. అవి వీరి ఖాతాలో వేసుకోవడం హస్యాస్పదంగా ఉందన్నారు. సీఎంగా తన హోదాను మర్చిపోయి రేవంత్ మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకొని వ్యాఖ్యలు చేస్తే మంచిదని పేర్కొన్నారు.