ఇంధన రంగంలో ఇండియా నెంబర్ వన్ గా మారుతోంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భారతదేశం 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించిందని ప్రకటిస్తూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశం 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి (1 billion tons of coal production)ని అధిగమించిందని ప్రకటిస్తూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఆసక్తికర ట్వీట్ చేశారు. అత్యాధునిక సాంకేతికతలు, సమర్థవంతమైన పద్ధతులతో, మేము ఉత్పత్తిని పెంచడమే కాకుండా స్థిరమైన, బాధ్యతాయుతమైన మైనింగ్‌ను కూడా కొసాగించామని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తన ట్వీట్‌లో చెప్పుకొచ్చారు. ఈ విజయం మన పెరుగుతున్న విద్యుత్ డిమాండ్లకు ఆజ్యం పోస్తుందని. ఆర్థిక వృద్ధిని పెంచుతుందని, ప్రతి భారతీయుడికి ఉజ్వల భవిష్యత్తును నిర్ధారిస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) దార్శనిక నాయకత్వంలో, ప్రపంచ ఇంధన కేంద్రంగా భారతదేశం ఎదగడానికి తన మార్గంలో పయనిస్తుందని అన్నారు. 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని చేరుకున్న క్రమంలో భారత దేశ ఇంధన భద్రతకు వెన్నెముకగా పనిచేస్తున్న బొగ్గు రంగం యొక్క అంకితభావంతో కూడిన శ్రామిక శక్తికి కిషన్ రెడ్డి తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కార్మికులు అవిశ్రాంత ప్రయత్నాలు, నిబద్ధత దీన్ని సాధ్యం చేశాయని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తన ట్వీట్ లో రాసుకొచ్చారు.