నగరాన్ని చుట్టేసిన కమిషనర్...
గ్రేటర్ వరంగల్ బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా బుధవారం నగరంలో పర్యటించారు. కరీంనగర్ రోడ్డు నుంచి హంటర్ రోడ్డు, కేఎంసీ, హన్మకొండ వరకు పారిశుద్ధ్యం, సెంట్రల్ మీడియన్ లలో మొక్కల ఉపస్థితిని పరిశీలించి సమర్ధ నిర్వహణకు అధికారులకు పలుసూచనలు చేశారు.
దిశ, వరంగల్ టౌన్ : గ్రేటర్ వరంగల్ బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా బుధవారం నగరంలో పర్యటించారు. కరీంనగర్ రోడ్డు నుంచి హంటర్ రోడ్డు, కేఎంసీ, హన్మకొండ వరకు పారిశుద్ధ్యం, సెంట్రల్ మీడియన్ లలో మొక్కల ఉపస్థితిని పరిశీలించి సమర్ధ నిర్వహణకు అధికారులకు పలుసూచనలు చేశారు. హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలో ఇంటింటి నుండి చెత్త సేకరణ, నల్లాల ద్వారా అందుతున్న తాగునీటి పై నేరుగా నగర ప్రజలను అడిగి తెలుసుకున్నారు. హంటర్ రోడ్డు ప్రాంతంలో టీఎస్ బీపాస్ క్రింద ఇంటి నిర్మాణం మంజూరు కోసం స్థలాలను కమిషనర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన బొందివాగు నాల, రంగంపేట వద్ద భద్రకాళి నాల పూడికతీతను పరిశీలించి, వరద నీరు నిలువ ఉండకుండా సులువుగా వెళ్లేలా పూడికతీత జరగాలని అన్నారు. గ్రేటర్ పరిధిలోని 33 ప్రధాన నాలల పూడికతీత వర్షాకాలం ప్రారంభానికి ముందే ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి కావాలని ఆదేశించారు. పోతన సెంకండరీ ట్రాన్స్ఫర్ స్టేషన్ ను పరిశీలించిన కమిషనర్ ట్రాన్స్ఫర్ స్టేషన్ వివరాలు తెలుసుకుని విరివిగా మొక్కలు పెంచాలని అన్నారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ రవీందర్ యాదవ్, సీపీ వెంకన్న, సీఎం హెచ్ఓ రాజేష్, సీహెచ్ఓ శ్రీనివాస్ రావు, డీసీలు శ్రీనివాస్ రెడ్డి, జోనా తదితరులు ఉన్నారు.