తెలంగాణ ప్రభుత్వం వల్లే తండాలకు మహర్దశ : కేసీఆర్
మరిపెడ పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున నిర్వహించిన ప్రజా ఆశీర్వాద
దిశ,మరిపెడ : మరిపెడ పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ పార్టీ చరిత్ర ఏంది ఆ పార్టీ నడవడిక ఎట్లాంటిది ప్రజలు ఆలోచించాలని 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో బేరీజు వేసుకోవాలన్నారు. ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయాలని దుర్మార్గులకు ఓటు వేస్తే ఐదు సంవత్సరాల దాకా అధోగతి పాలవుతామని రాయి ఏదో రత్నమేదో ప్రజలు గుర్తించాలన్నారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే తండాలకు మహర్దశ వచ్చిందని గిరిజనుల కోరిక అయిన మా తండాలో మా రాజ్యం కలను సాకారం చేశామని గుర్తు చేశారు.
ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, 10 హెచ్పీ మోటర్లు రైతులు వాడుతారా 30 లక్షల రైతులకు టెన్ హెచ్ పి మోటర్లు సమకూరిస్తే ఎంత ఖర్చవుతుంది కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై మండిపడ్డాడు. వెన్నారం కాలువ అభివృద్ధి చేసుకుంటే డోర్నకల్ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది అని అంటూ కురవి వీరభద్ర స్వామి దయవల్ల తెలంగాణ కల సాకారమైందని బంగారు కోర మీసాల మొక్కు కూడా చెల్లించుకున్నానాని గుర్తు చేశారు.