మేడిగడ్డ ప్రాజెక్టు గేటు వద్ద ప్రజలను తోసేసిన పోలీసులు
మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వెంట వెలుతున్న కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలను పోలీసులు అనుమతించకపోవడంతో పోలీసులకు, ప్రజలకు మధ్య తోపులాట జరిగంది.
దిశ, కాటారం : మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వెంట వెలుతున్న కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలను పోలీసులు అనుమతించకపోవడంతో పోలీసులకు, ప్రజలకు మధ్య తోపులాట జరిగంది. దీంతో వారంతా అంబటి పెళ్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
దోపిడి రాజ్యం దొంగల రాజ్యం పోలీసు జులుం నశించాలి అంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. మట్టి పెళ్లి పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డగించినప్పటికీ నాయకులు, ప్రజలు మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గరికి పరుగు పరుగున వెళ్లారు. అంబర్ పెళ్లి గేట్ నుండి ప్రాజెక్టు గేటు వద్దకు వెళ్లగా సీఆర్పీఎఫ్ ప్రత్యేక పోలీస్ బలగాలు ప్రాజెక్టు దగ్గరికి వెళ్లకుండా పోలీసులు నిలువరించారు.