కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డగించిన ఎన్‌ఎస్‌యూఐ నేత‌లు.. విద్యార్థులపై దాడి చేసిన బీఆర్ఎస్ లీడర్లు (వీడియో)

హ‌న్మ‌కొండ జిల్లా క‌మ‌లాపూర్ మండ‌లంలోని ప‌లు అభివృద్ధి ప‌నుల ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన మునిసిప‌ల్ మ‌రియు ఐటీ శాఖ‌ల మంత్రి కేటీఆర్‌కు నిర‌స‌న సెగ త‌గిలింది.

Update: 2023-01-31 07:45 GMT

దిశ‌, క‌మ‌లాపూర్‌ : హ‌న్మ‌కొండ జిల్లా క‌మ‌లాపూర్ మండ‌లంలోని ప‌లు అభివృద్ధి ప‌నుల ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన మునిసిప‌ల్ మ‌రియు ఐటీ శాఖ‌ల మంత్రి కేటీఆర్‌కు నిర‌స‌న సెగ త‌గిలింది. మంగ‌ళ‌వారం గూడూరుకు ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో చేరుకున్న మంత్రి కేటీఆర్ క‌స్తూర్భా విద్యాల‌యంలోని అభివృద్ధి ప‌నుల‌ ప్రారంభోత్స‌వానికి వెళ్తుండ‌గా ఎన్ ఎస్ యూఐ విద్యార్థి నేత‌లు ఒక్క‌సారిగా కాన్వాయ్ మ‌ధ్య‌లోకి దూసుకొచ్చారు.

న‌ల్ల‌బ్యాడ్జీలు ధ‌రించిన దాదాపు 20 మంది విద్యార్థులు మంత్రి కేటీఆర్‌కు, రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు ఐదు నిముషాల పాటు ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఆందోళ‌న‌కారుల‌ను కాన్వాయ్ ఎదుట నుంచి త‌ప్పించేందుకు పోలీసులు శ్ర‌మించారు. అయితే ఇదే స‌మ‌యంలో కొంత‌మంది బీఆర్ ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అత్యుత్సాహం చూపుతూ ఆందోళ‌న‌కారుల‌పై పిడుగుద్దులు కురిపించారు. విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేయ‌డంతో నాలుగురైదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇద్ద‌రు అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లుగా తెలుస్తోంది.

Full View
Tags:    

Similar News