ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తన రౌడీ రాజకీయంతో నా హత్యకు ప్రయత్నించాడు: రాకేష్ రెడ్డి
ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ నాపై హత్యకు కుట్ర చేశాడని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బీజేపీ నాయకులు ముట్టడి చేశారు.
దిశ, హనుమకొండ టౌన్: ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ నాపై హత్యకు కుట్ర చేశాడని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బీజేపీ నాయకులు ముట్టడి చేశారు. ముట్టడిలో ఇరువర్గాలు కర్రలతో, రాళ్లతో కోట్టు్కొగా పలువురిగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. వినయ్ భాస్కర్ ఈ రోజు మా నాయకుల, కార్యకర్తల రక్తం కళ్ల చూసాడు. మీ అంతు చూస్తాం అని హెచ్చరించారు. వినయ్ భాస్కర్ నా పై హత్యకు కుట్ర చేశాడంటూ.. పోలీస్లు ప్రేక్షక పాత్ర వహించారు ఆరోపించారు. వందల మంది గూండాలను తన ఇంటి చుట్టూ పెట్టుకొని, మాపై రాళ్ళు రువ్వారు. కర్రలతో దాడి చేశారన్నారు.
ఎవరికి ఏ భాషలో సమాధానం చెప్పాలో అలాగే చెప్తామని, వినయ్ భాస్కర్ గతంలో అన్నట్టే తన రౌడీ రాజకీయం మొదలు పెట్టాడని ఫైర్ అయ్యారు. మేం ఉన్నదే ఆ రౌడీ రాజకీయాలను రూపుమాపడానికే అని, మా కార్యకర్తల రక్తం చూసిన మీకు వడ్డీతో సహా చెల్లిస్తాం అన్నారు. మా నాయకులు శ్రావణ్ యాదవ్, రాజేష్, నాగరాజు, గణేష్, శివల తలలు పగలకొట్టారని, ఎమ్మెల్యే అధికారిక రౌడీల వ్యవహరిస్తున్నారన్నారు. మా పోరాటం పేద ప్రజల కోసం, ఈ పోరాటంలో మేం చావడానికైన సిద్ధం అంటూ, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ నీ ఉడుత ఊపులకు బీజేపీ నాయకులు బయపడరని, తగిన రీతిలో సమాధానం చెప్తామని.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు.