భూములు కోల్పోయిన రైతులను ఆదుకుంటాం

భూములు కోల్పోయిన రైతులను ఆదుకుంటాం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.

Update: 2025-03-25 16:33 GMT
భూములు కోల్పోయిన రైతులను ఆదుకుంటాం
  • whatsapp icon

దిశ, వరంగల్ : భూములు కోల్పోయిన రైతులను ఆదుకుంటాం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం మామునూరు ఎయిర్ పోర్టు, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, గ్రీన్ ఫీల్డ్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పనుల ఏర్పాట్లపై అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని కార్యాచరణ ప్రణాళిక పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ ఏనుమాముల, గీసుకొండ, ఖిలావరంగల్, ఇన్నర్ రింగ్ రోడ్డు పనులలో భూములు కోల్పోయిన రైతులకు అవార్డింగ్ పాస్ అయి వారికి డబ్బులు చెల్లించుటకు సిద్ధంగా ఉన్నామని, ఆ పనులు పూర్తి చేసే ప్రక్రియలో వరంగల్ ఆర్డీఓను ఆదేశించారు. ఎయిర్ పోర్ట్  నిర్మాణం పనులలో ఖిలా వరంగల్ లోని నక్కలపల్లి, గాడిపల్లిలలో సర్వే పూర్తి అయిందని, పనుల పురోగతికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

    కాకతీయ మేఘ టెక్స్టైల్ పార్కులో గ్రీన్ కవరేజీ ఏర్పాటు చేయాలని, వారంలోగా 15000 మొక్కలు నాటి వాటికి జియో ట్యాగింగ్ ఏర్పాటు చేసి సర్వేవ్ అయ్యేలా చూడాలని జీఎం, ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. ఎంప్లాయిమెంట్ జనరేట్ చేయుటకు జాబ్ మేళా నిర్వహించి గీసుకొండ, సంగెం, వరంగల్ లో 18 నుండి 39 సంవత్సరాల నిరుద్యోగులను గుర్తించి  వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎంప్లాయిమెంట్ అధికారిణికి ఆదేశించారు. అలాగే కుట్టు శిక్షణ కేంద్రాలలో శిక్షణ ఇప్పించి నాణ్యత, ప్రావీణ్యత కలిగిన  వారిని ఎంపిక చేయాలని డీఆర్డీఓ, పీడీని ఆదేశించారు. నేషనల్ హైవే పనులలో నర్సంపేటలోని గీసుకొండ, సంగెం, చింత నెక్కొండలో ఆర్బిట్రేషన్ నిర్వహించి ల్యాండ్ ఎక్విజేషన్ పనులకు అవార్డు పాస్ చేసేందుకు పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు వరంగల్ సత్యపాల్ రెడ్డి, నర్సంపేట ఉమారాణి, సంబంధిత తహసీల్దార్లు, నాగేశ్వరరావు, ఇక్బాల్, రాజ్ కుమార్, రియజుద్దీన్, వెంకట్ స్వామి, ఆర్ అండ్ బీ ఈఈ జితేందర్ రెడ్డి, ఇరిగేషన్ ఈఈ రామకృష్ణ, నేషనల్ హైవే  అధికారి, ఇండస్ట్రీ అధికారి రమేష్ పాల్గొన్నారు. 


Similar News