తెలంగాణలో శాటిలైట్ క్యాంపస్‌లు, మొబైల్ శిక్షణ యూనిట్లు ఏర్పాటు చేయండి

సహకార రంగంలో సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు విశ్వవిద్యాలయాల స్థాయి సంస్థలను నెలకొల్పడం హర్షనీయమని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు.

Update: 2025-03-26 16:30 GMT
తెలంగాణలో శాటిలైట్ క్యాంపస్‌లు, మొబైల్ శిక్షణ యూనిట్లు ఏర్పాటు చేయండి
  • whatsapp icon

దిశ, హనుమకొండ : సహకార రంగంలో సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు విశ్వవిద్యాలయాల స్థాయి సంస్థలను నెలకొల్పడం హర్షనీయమని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయ బిల్లుపై బుధవారం ఎంపీ డా. కడియం కావ్య పార్లమెంట్ లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సహకార రంగంలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా శాటిలైట్ క్యాంపస్ లను ప్రోత్సహించాలని సూచించారు. లోక్‌సభలో త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయ బిల్లు ఆశా కిరణాలతోపాటు అనిశ్చితిని కూడా తెస్తోందని, వరంగల్ రైతులు, సహకార కార్మికుల సంక్షేమం కోసం దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని ఆమె అన్నారు.

    గుజరాత్‌లోని ఆనంద్‌లో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు సహకార రంగంలో శిక్షణ, పరిశోధనకు ఊతమిస్తుందని, అయితే వరంగల్ రైతులకు ఇది అందుబాటులో ఉంటుందా అని ఎంపీ ప్రశ్నించారు. ఇర్మాను విశ్వవిద్యాలయంగా మార్చడం సానుకూలమైనప్పటికీ, గ్రామీణ భారత అవసరాలకు ఇది ఎలా సరిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో శాటిలైట్ క్యాంపస్‌లు, మొబైల్ శిక్షణ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సహకార ఉద్యోగుల సామర్థ్యం కోసం 5 ఏళ్ల కార్యాచరణ ప్రణాళిక, 50% గ్రామీణ కార్మికులకు శిక్షణ, 10 ప్రాంతీయ కేంద్రాల ఏర్పాటు వంటి లక్ష్యాలను బిల్లులో చేర్చాలని కోరారు. సహకార లభ్యత, సమ్మిళిత భావన, పారదర్శకత కోసం ఈ బిల్లును సమర్థవంతంగా రూపొందించాలని సభను కోరారు. గ్రామీణులకు ఉపకరించే సహకార బిల్లు కోసం వరంగల్ చూస్తోందని, తెలంగాణ ఎదురుచూస్తోంది అని అన్నారు. 

Similar News