మూడు రోజుల క్రితమే ప్రారంభం.. అంతలోనే లీకేజీ

తెలంగాణలో యాసంగి పంటలకు నీళ్లివ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రోజుల క్రితమే దేవాదుల పంప్ హౌస్ మోటార్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు..

Update: 2025-03-30 10:27 GMT
మూడు రోజుల క్రితమే ప్రారంభం.. అంతలోనే లీకేజీ
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో పంటలకు నీళ్లివ్వాలనే ఉద్దేశంతో మూడు రోజుల క్రితమే దేవాదుల పంప్ హౌస్ మోటార్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) ప్రారంభించారు. అయితే తాజాగా లోపం బయటపడింది. టన్నెల్‌ లీకేజీ కలకలం రేగింది. దేవాదుల పంప్ హౌస్‌ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్‌కు నీళ్లు అందుతున్నాయి. కానీ ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద టన్నెల్‌ లీకేజీ బయటపడింది. దీంతో నీళ్లు భారీగా పోతున్నాయి. పంట పొలాల్లోకి  నీళ్లు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. టన్నెల్ మోటార్లను ఆఫ్ చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. సిబ్బంది ఏ మాత్రం అశ్రద్ధ చేసినా టన్నెల్ మొత్తం కూలిపోయి ఉండేదని అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News