దంచికొడుతున్న భారీ వర్షం.. మరికొన్ని గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులు

గత కొన్ని రోజులుగా వేసవి ఎండల వేడితో ప్రజలు సతమతమవుతున్న వేళ.. మారిన వాతావరణం కాస్త ఉపశమనం కలిగించింది. తెలంగాణ, కోస్తా, మహారాష్ట్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.

Update: 2025-04-03 03:24 GMT
దంచికొడుతున్న భారీ వర్షం.. మరికొన్ని గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా వేసవి ఎండల వేడితో ప్రజలు సతమతమవుతున్న వేళ.. మారిన వాతావరణం (weather) కాస్త ఉపశమనం కలిగించింది. తెలంగాణ, కోస్తా, మహారాష్ట్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో ఈ రోజు ఉదయం నుంచి మబ్బులు కమ్ముకున్నాయి. ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (Adilabad District)లో భారీ వర్షం కురిసింది. అలాగే దీని ప్రభావంతో పలు జిల్లాల్లో చల్లని వాతావరణం నెలకొంది. వాతావరణ శాఖ (Department of Meteorology) అంచనా మేరకు వచ్చే రెండు, మూడు గంటల్లో నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోను మోస్తారు వర్షం (Brought rain) కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత తెలంగాణ రాష్ట్రం (Telangana State)లోని అనేక జిల్లాలతో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం (Rain across Hyderabad city) కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో.. రానున్న మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం భిన్నంగా ఉండబోతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మంగళ, బుధవారాల్లో ఉష్ణోగ్రతలు 40° సెంటీగ్రేడ్‌లోపే పరిమితమైనట్లు పేర్కొన్నారు. రానున్న మూడు రోజులు కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Read More..

రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్  

Similar News