రూ.నలభై వేలు ఎలుకల పాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని సర్వాయిపేట గ్రామంలో లోడారి నందు అనే మిర్చి రైతు రూ.నలబై వేలను ఎలుకలు చిత్తుచిత్తుగా కొట్టాయి.

Update: 2025-03-25 13:06 GMT
రూ.నలభై వేలు ఎలుకల పాలు
  • whatsapp icon

దిశ, పలిమెల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని సర్వాయిపేట గ్రామంలో లోడారి నందు అనే మిర్చి రైతు రూ.నలబై వేలను ఎలుకలు చిత్తుచిత్తుగా కొట్టాయి. రైతు మిర్చి కోత కోసం కూలీలకు ఇవ్వడానికి నలభై వేల రూపాయలను అప్పు తెచ్చాడు. వాటిని కవర్లో ప్యాక్ చేసి వడ్లగుమ్మిలో భద్రంగా దాచిపెట్టాడు. మిర్చి కోయించేందుకు కూలీలతో కలిసి చేనుకు వెళ్లిపోయాడు. సాయంత్రం కూలీలకు ఇవ్వడంకోసం వడ్లగుమ్మివద్దకు వెళ్లి చూడగా డబ్బులను ఎలుకలు చిత్తుచిత్తుగా కొట్టాయి. దాంతో రైతు లబోదిబో మన్నాడు.  


Similar News