గిరిజనుడి ఇంటిపై మున్సిపల్ అధికారుల దౌర్జన్యం

జిల్లా కేంద్రం భూపాలపల్లి పట్నం మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు పెద్దకుంటపల్లి గ్రామంలోని గిరిజనుడి ఇంటిపై మున్సిపల్ అధికారులు దౌర్జన్యానికి దిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2025-03-25 13:43 GMT
గిరిజనుడి ఇంటిపై మున్సిపల్ అధికారుల దౌర్జన్యం
  • whatsapp icon

దిశ, మల్హర్(భూపాలపల్లి) : జిల్లా కేంద్రం భూపాలపల్లి పట్నం మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు పెద్దకుంటపల్లి గ్రామంలోని గిరిజనుడి ఇంటిపై మున్సిపల్ అధికారులు దౌర్జన్యానికి దిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి పన్ను విషయంలో మున్సిపల్ అధికారులు వాంకుడోత్ హున్ననాయక్ ఇంటికి చేరుకొని బకాయి పడ్డ రూ.20 వేలు ఇంటి పన్ను కట్టాలని హంగామా సృష్టించారు. ఇంటి యజమాని కొంత వెసులు బాటు కల్పించాలని కోరగా రూ.5500 కట్టాలని సూచించడంతో ఇంటి యజమాని కట్టేశాడు. మళ్లీ 15 రోజులకు వచ్చిన అధికారులు ఇంటి యజమానితో గొడవకు దిగారు. మిగతా రూపాయలు కట్టనిదే విడిచి పెట్టేది లేదంటూ దురుసుగా ప్రవర్తిస్తూ వాగ్వివాదానికి దిగారు. నోటికాడి బుక్క నేలపాలు చేశారు.

    ఇంట్లో ఉన్న వంట సామాగ్రి రోడ్డుపై విసిరారు. బలవంతంగా ఇంటి తలుపులు తీసుకెళ్లారు. ములుగు జిల్లా రామచంద్రపురం నుంచి భూపాలపల్లి మున్సిపాలిటీ పెద్దకుంటపల్లి తండాలో వలస వచ్చి మేకలు కాసుకుంటూ చిన్న ఇల్లు కట్టుకొని జీవనం సాగిస్తున్న గరిజనుడు హున్నాయక్ కుటుంబంపై మున్సిపల్ అధికారులు ఇంటి పన్ను రూపంలో విరుచుకుబడ్డారు. ఆ కుటుంబాన్ని చెల్లాచెదురు చేశారు. తన వద్ద రూ.5,500 ఉంటే కట్టాలని కట్టించుకొని మళ్లీ 15 రోజుల తర్వాత వచ్చి మిగతా డబ్బులు కట్టలేదని దుర్బషలాడుతూ తన ఇంటి తలుపులు బలవంతంగా తీసుకెళ్లారు. ఇదేంటని అడ్డుకోకపోతే నట్టేశారు. ఇంటి తలుపులు ఇవ్వకుంటే ఆత్మహత్యే శరణ్యమని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నా ఇంటి తలుపులు ఇప్పించాలని హున్ననాయక్ కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ ను వేడుకున్నారు. మున్సిపల్ అధికారుల తీరుపై గిరిజన సంఘాలు మండిపడ్డాయి. మున్సిపల్ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పేర్కొన్నారు. 


Similar News