విద్యుత్ శాఖ బదిలీల్లో అవకతవకలు ...

జనగామ జిల్లాలో జరుగుతున్న విద్యుత్ శాఖ బదిలీల్లో భారీగా అవకతవకలు జరుతున్నటు ప్రచారం జరుగుతుంది. ఇటీవలే టి ఎస్ ఎన్ పి డి సి ఎల్ సీ ఏం డి బదిలీల గురించి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది.

Update: 2024-10-08 12:54 GMT

దిశ, జనగామ : జనగామ జిల్లాలో జరుగుతున్న విద్యుత్ శాఖ బదిలీల్లో భారీగా అవకతవకలు జరుతున్నటు ప్రచారం జరుగుతుంది. ఇటీవలే టి ఎస్ ఎన్ పి డి సి ఎల్ సీ ఏం డి బదిలీల గురించి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం జిల్లా అధికారులు బదిలీలు చేపట్టాలి కానీ జిల్లా స్థాయి అధికారులు ఒక యూనియన్ కి కొమ్ము కాస్తూ బదిలీలను గైడ్ లైన్స్ ప్రకారం కాకుండా వాళ్ళ ఇష్ట రీతిన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. డబ్బులు ఇస్తే పని కథం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నో యూనియన్ల ఉన్నా ఒక పెరు మోసిన యూనియన్ కొంత మంది ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి వారికి కావలసిన చోట బదిలీలను చేయడానికి ఒప్పుకుంటున్నారు.

ఆ యూనియన్ పెద్దలు జిల్లా స్థాయి అధికారులకు మందు, డబ్బులు ఆశ చూపి గైడ్ లైన్స్ కి విరుద్ధంగా బదిలీలను చేపట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఉద్యోగులు బాహటంగానే చర్చించుకుంటున్నారు. ఇలా కొంత మంది ఉద్యోగుల కోసం గైడ్ లైన్స్ కి విరుద్ధంగా బదిలీలను చేస్తే మిగతా ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఉద్యోగులు అందరూ చర్చించుకోవడం కొస మెరుపు. అసలు ఈ తతంగంకి ఊతం పోసిందెవరు, అసలు బదిలీల్లో ఏమి జరుగుతుంది..? వాస్తవం ఎంత అనే కోణంలో అధికారులు స్పందిస్తారా ? ఇంత జరుగుతున్నా వారి మీద చర్యలు తీసుకొని గైడ్ లైన్స్ ప్రకారం బదిలీలు చేపట్టే విధంగా అధికారులు దృష్టి పెడుతరో లేదో ఉద్యోగస్తుల గుసగుసలకు చెక్ పెడతారా లేదా వేచి చూద్దాం.


Similar News