చినుకు పడితే చిత్తడే.. నరకయాతన పడుతున్న కాలనీవాసులు

గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ ఆరేపల్లి గ్రామంలో నిత్యం ప్రజలు

Update: 2024-07-01 13:32 GMT

దిశ, హనుమకొండ టౌన్ : గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ ఆరేపల్లి గ్రామంలో నిత్యం ప్రజలు వారి అవసరాలకు బయటకు రావాలంటే నరకయాతన పడుతున్నారు. చినుకు పడితే ఆ కాలనీ మొత్తం నీటి మాయమై గుంతలు ఏర్పడి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరెపల్లి గ్రామం ఆంధ్ర బ్యాంకు పక్కన గల కాలనిలో కొన్ని వందల కుటుంబాలు నివసిస్తున్నాయి. వర్షం పడితే, దారిలో గుంతలు పడి వర్షపు నీటితో కోతలకు గురై అద్వానంగా అవుతుందని పాలకులు మారిన, ప్రభుత్వాలు మారినా పట్టించుకునే వారే లేరని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకెన్నాళ్లు ఈ నరకయాతన అని విమర్శిస్తున్నారు. ఇక్కడి నుండి కనీసం ద్విచక్ర వాహనం వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే అని కొంతమంది వాహనదారులు వాపోతున్నారు. గతంలో ఈ దారిలో ప్రమాదాలకు గురై గాయాల పాలైన కుటుంబాలు ఎన్నో, ఎన్నోసార్లు కార్పొరేషన్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడంలేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా రోడ్డు పనులు చేపట్టాలని కాలని వాసులు అధికారులను, ప్రజాప్రతినిధులకు వేడుకుంటున్నారు.


Similar News