వంద కొట్టు పొట్టేలు పట్టు..సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..

వంద కొట్టు గొర్రెపొట్టేలు పట్టు..అనే పోస్ట్ సోషల్ మీడియాలో దసరా కానుక అంటూ వాట్సాప్ గ్రూప్ లో చక్కర్లు కొట్టడం విస్మయానికి గురి చేస్తోంది.

Update: 2024-10-07 10:31 GMT

దిశ,నెక్కొండ: వంద కొట్టు గొర్రెపొట్టేలు పట్టు..అనే పోస్ట్ సోషల్ మీడియాలో దసరా కానుక అంటూ వాట్సాప్ గ్రూప్ లో చక్కర్లు కొట్టడం విస్మయానికి గురి చేస్తోంది. వరంగల్ జిల్లాలోని ఒక గ్రామంలో వాట్స్అప్ గ్రూప్ లో ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో గ్రామస్తులతో పాటు మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిర్వాహకులు ఒక కూపన్ కు రూ.100 రుసుముగా పెట్టారు. మొత్తం 250 కూపన్లు టార్గెట్ గా పెట్టుకున్నారు. డ్రాలో మొదటి బహుమతిగా గొర్రె పొట్టేలు, రెండో బహుమతిగా బ్లెండర్స్ ప్రైడ్ ఫుల్ బాటెల్ గా నిర్ణయించారు. మిగతా బహుమతులుగా నాటుకోళ్ళు, బీర్లు, కూల్ డ్రింక్స్, 5 సీసాల కల్లు, వంట నూనె ప్యాకెట్లు, గోధుమపిండి, కోడిగుడ్లు అంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు టోకెన్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ డ్రా ను గ్రామస్తుల సమక్షంలో శుక్రవారం రోజు ఉదయం 8 గంటలకు వీడియో నిఘాలో తెస్తున్నట్లు ఓ కరపత్రం చక్కర్లు కొడుతోంది.. ఈ వార్తపై మందుబాబులు "పోతే వంద - వస్తే విందు, మందు అంటూ సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.


Similar News