ఫేక్ రెవెన్యూ పత్రాలను తయారు చేస్తున్న మాజీ విఆర్ఓ అరెస్ట్

నకిలీ రెవెన్యూ పత్రాలను తయారు చేస్తున్న మాజీ విఆర్ఓ తో సహా మరో వ్యక్తి అరెస్ట్ అయిన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం లో చోటుచేసుకుంది.

Update: 2022-11-26 13:20 GMT

దిశ, హనుమకొండ టౌన్: నకిలీ రెవెన్యూ పత్రాలను తయారు చేస్తున్న మాజీ విఆర్ఓ తో సహా మరో వ్యక్తి అరెస్ట్ అయిన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. రెవెన్యూ విభాగం లో పనిచేసిన అనుభవం తో సులువుగా డబ్బు సంపాదన కొరకు నకిలీ రెవెన్యూ పత్రాలను సృష్టిస్తున్న మాజీ విఆర్ఓ వరంగల్ జిల్లా నెక్కొండ మండలానికి చెందిన మద్ది వెంకటరెడ్డి తో పాటుగా మరో వ్యక్తి కల్వచర్ల రఘు ను టాస్క్ ఫోర్స్, నెక్కొండ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితుల్లో ఒకడైన మద్ది వెంకటరెడ్డి 1973 సంవత్సరం నుంచి 2012 వరకు రెవెన్యూ విభాగం లో పట్వారీ, పంచాయతీ కార్యదర్శి, విఆర్ఓ నెక్కొండ, పర్వతగిరి మండలాల్లో పనిచేసి పదవీ విరమణ పొందారు. రెవెన్యూ విభాగం లో సుధీర్ఘకాలం పని చేసిన అనుభవంతో నకిలీ పత్రాల తయారీకి తెర తీశాడు.


వీరి నుండి పోలీసులు నకిలీ పట్టాదారు పాస్ బుక్‌లు, ఆర్టీఓకు సంబంధించిన నకిలీ ల్యాండ్ కన్వర్జేషన్ ప్రొసీడింగ్స్, 130 సి ఫారాలు, తహశీల్దార్, ఆర్టీవో అధికారులకు సంబంధించిన నకిలీ ముద్రణలు, పహానీలు, కొటేషన్లు, బ్యాంకు చాలన్లు, గ్రామ నక్షాలు, స్టాంపు పేపర్లను పోలీసులు విశ్రాంతి విఆర్‌ఓ ఇంటి నుండి స్వాధీనం చేసుకున్నారు. పత్రాలపై మరో నిందితుడైన కల్వచర్ల రఘు తో పాటుగా తను కూడా తహశీల్దార్, ఆర్టీఓ సంతాకలను ఫోర్జరీ సంతకాలు చేసేవాడు. పత్రాలను పొందిన వ్యక్తులు బ్యాంకుల నుంచి రుణం పొందే వారు. ఈ వ్యవహారం పై అధికారులకు సమాచారం రావడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నిందితులు నేరాన్ని అంగీకరించారు. ఈ ఇద్దరి నిందితులపై నెక్కోండ, పర్వతగిరి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేయడం జరిగిందని అదనపు డీసీపీ తెలిపారు.

నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, ఇన్ స్పెక్టర్ సురేష్ కుమార్, వెంకటేశ్వర్లు, ఎస్ఐ పవన్ కుమార్, నెక్కొండ, పర్వతగిరి ఎస్ఐలు పర్వీన్, దేవేందర్ తో పాటు టాస్క్ ఫోర్స్ హెడానిస్టేబుల్ శ్యాంసుందర్, అశోక్, స్వర్ణలత, కానిస్టేబుల్ నాగరాజు, సృజన్, సురేష్, శ్యాం, శ్రీను, శ్రవణ్, నవీన్‌ను అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ అభినందించారు.

Tags:    

Similar News