మేడిగడ్డ ప్రాజెక్టులో లోపాలు బయటపడ్డాయి: మాణిక్ రావు ఠాక్రే

కేసీఆర్ కలల ప్రాజెక్టుగా చెప్పబడిన చెబుతున్న మేడిగడ్డ ప్రాజెక్టులో రాహుల్ గాంధీ సందర్శనతో లోపాలు గుర్తించినట్లు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు అన్నారు.

Update: 2023-11-02 08:27 GMT

దిశ, కాటారం : కేసీఆర్ కలల ప్రాజెక్టుగా చెప్పబడిన చెబుతున్న మేడిగడ్డ ప్రాజెక్టులో రాహుల్ గాంధీ సందర్శనతో లోపాలు గుర్తించినట్లు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు అన్నారు. గురువారం అంబర్ పల్లి గ్రామంలో జరిగిన మహిళా సాధికారత సదస్సులో పాల్గొని మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ మహిళలతో మాట్లాడేందుకు అంబట్టుపల్లి గ్రామంలో సదస్సులో పాల్గొని ఇది గడ్డ ప్రాజెక్టును సందర్శించారని ప్రాజెక్టు నిర్మాణంలో అందరికీ అనుమానాలు ఉన్నాయని అందులో భాగంగానే కుంగిపోయిన పియర్స్ను పరిశీలించినట్లు తెలిపారు. ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేశారని మాణిక్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న ఈ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయిన ఘటనతో ప్రభుత్వ డొల్ల తనం బయటపడిందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివరాలు బయటపెట్టాల్సి ఉందని మాణిక్ రావు తెలిపారు.

బీఆర్ఎస్ చెప్పినట్లుగా నడుచుకుంటున్న బీజేపీ ప్రభుత్వం: భట్టి విక్రమార్క

రాష్ట్రంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొందని బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం ఐటి దాడులు చేస్తోందని కాంగ్రెస్ అసెంబ్లీ పక్ష నాయకుడు భట్టి విక్రమార్క ఆరోపించారు. రాహుల్ గాంధీతో మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించే పరిస్థితిలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల కోసం ఎన్నికలలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఐటి దాడులు చేస్తున్నాయని ఆయన తెలిపారు.

ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలకు పాల్పడడం ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లేనని ఇది ఎంత వరకు సమంజసమని బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలను బట్టి విక్రమార్క ప్రశ్నించారు. సీబీఐ ఐటి ఈడి సంస్థలు దాడులు చేయడం పట్ల సమయమనం పాటించాలని ప్రభుత్వాలు వస్తూ పోతున్నప్పటికీ, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చెప్పినంత మాత్రాన దాడులు చేయవద్దని అన్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన మేడిగడ్డ ఇతర ప్రాజెక్టులను లోపం ఏర్పడినప్పుడు, ప్రజలు సందర్శినకు వచ్చినప్పుడు నిరోధించడం సమంజసం కాదని బట్టి విక్రమార్క ఆరోపించారు.

ప్రాజెక్టుల నిర్మాణంపై సమగ్ర విచారణ చేయాలి: కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు

కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ సరస్వతి బ్యారేజీలలో ఏర్పడిన పిల్లర్ల కుంగుబాటుపై సమగ్ర విచారణ జరిపించి దోషులపై చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్టు సందర్శనకు రాకుండా అడ్డుకుంటున్న విషయంపై దాగిన చిదంబర రహస్యమేమిటో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఏఐసీసీ కార్యదర్శి మంథని కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. మేడిగడ్డ సరస్వతి బ్యారేజ్ నిర్మాణంతో మంథని పెద్దపెల్లి జిల్లాలకు ఎలాంటి ఉపయోగం లేదని, ఒక ఎకరానికి సాగునీరు లభించక పోవడంతో రైతులు తమ భూములు కోల్పోయి నిరాశ్రయులైనప్పటికీ పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని శ్రీధర్ బాబు ఆరోపించారు.

బ్యాక్ వాటర్‌తో ఈ ప్రాంత రైతులు నష్టపోతున్నారని ప్రాంత రైతులకు న్యాయం జరిగేందుకు సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆదుకుంటామని రాహుల్ గాంధీకి విన్నవించినట్లు శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంథని నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాలకు సాగునీరు అందించే మినీ కాలేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణం జరగకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు.

Tags:    

Similar News