ప్రతిపక్షాలకు రైతులే బుద్ధి చెప్పాలే- ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
మండలంలోని పెద్ద కొర్పోలు, చిన్న కొర్పోలు, అలంఖానిపేట గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు
దిశ,నెక్కొండ: మండలంలోని పెద్ద కొర్పోలు, చిన్న కొర్పోలు, అలంఖానిపేట గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు.మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటుచేసిన సభలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ"ప్రతిపక్షాలు అయోమయంలో పడ్డాయన్నారు. గతంలో నర్సంపేట నియోజక వర్గాన్ని పాలించిన మాజీ ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. కొత్త జనరేషన్ కు ఈ మాజీ ఎమ్మెల్యేలు ఏమి చేయలేరని,వాళ్ళ ఆలోచన సరళి గాడి తప్పిందని ప్రజలు గమనించాలన్నారు.
మండల అభివృద్ధిని గత పాలకులు విస్మరించారని ఎద్దేవా చేశారు. ప్రతి క్షణం ప్రజల సంక్షేమం కోసమే ఆలోచిస్తానని అన్నారు. చిన్నకొర్పోలు-పెద్దకొర్పోలు రోడ్డు కనెక్టివిటీ కోసం వట్టేవాగుపై 13 కోట్ల 90 లక్షలతో హై లెవల్ బ్రిడ్జి,నాగారం నుండి ఇంటికన్నె రైల్వే స్టేషన్ వరకు బీటీ రోడ్డు, వట్టెవాగుపై చెక్ డ్యామ్,బ్రిడ్జి కం రోడ్డుకు 18 కోట్ల 60 లక్షలు, అలంఖానిపేట -చిన్నకొర్పోలు వరకు 4.67 కిలోమీటర్ల బీటీ రోడ్డుకు 3కోట్ల 85 లక్షలు లాంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్,మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సహకారంతో శంకుస్థాపన చేశామన్నారు. 60 ఏళ్ల నుండి ప్రతిపక్షాలు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.
గత మాజీ ఎమ్మెల్యే హయాంలో గిరిజనుల కోసం కోట్ల నిధులు వచ్చాయని అవి ఎక్కడికి పోయాయని,దీనికి మాజీ ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వారు నాకంటే ఒక్క పైసా అభివృద్ధి పనులు చేసిన చెప్పాలని సవాల్ విసిరారు.15 వేయిల టన్నుల రైతు గోదాములు నిర్మిచాం. రైతులు ఏది అడిగితే అది ఇచ్చామన్నారు. రైతు ఇంటికే 75 కోట్లతో వ్యవసాయ యంత్రాలు పంపించే కార్యక్రమం నడుస్తుందని అన్నారు. రైతులకు లబ్ది జరుగొద్దని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని,వారికి రైతులే బుద్ధి చెప్పాలన్నారు.
కరోనాతో 2 ఏళ్ళు ప్రజలు ఇబ్బంది పడితే రాష్ట్రంలోనే మొట్టమొదటి ఐసోలేషన్ సెంటర్ ను నర్సంపేటలో ఏర్పాటుచేసి 1079 మంది బాధితులకు మీ బిడ్డగా సకల సౌకర్యాలు కల్పించానని అన్నారు.కానీ ప్రతిపక్షాలు ఇళ్లకే పరిమితమై నియోజకవర్గ ప్రజలను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. ఏమిచేయని ప్రతిపక్షాలు ఇప్పుడు ఓట్లకోసం బయలుదేరారని దీన్ని ప్రజలు గమనించాలని అన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మండలానికి 250 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేశానన్నారు. ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చానని మీ అన్నగా తమ్ముడిగా,బిడ్డగా మరొక్కసారి ఆశీర్వదించాలని కోరారు.