లొంగిపోయిన మావోయిస్టులు.. రివార్డు అందజేసిన ఎస్పీ...
బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయిన ప్రభుత్వ నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ సభ్యులకు ములుగు జిల్లా ఎస్పీ రివార్డును ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ అందజేశారు.

దిశ, ములుగు ప్రతినిధి : బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయిన ప్రభుత్వ నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ సభ్యులకు ములుగు జిల్లా ఎస్పీ రివార్డును ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ అందజేశారు. సరెండర్ - కమ్ - రిహాబిలిటేషన్ లో భాగంగా ములుగు జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయిన ప్రభుత్వ నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ నేషనల్ పార్క్ ఏరియా కమిటీకి చెందిన సభ్యురాలు అయిన అలువ స్వర్ణ @ స్వర్ణక్కకు పుల్సం పద్మ @ ఊరే @ గంగక్కలకు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ప్రభుత్వం తరఫున వారికి అందవలసిన రివార్డును అందజేశారు.
వారిలో అలువ స్వర్ణ @ స్వర్ణక్క కు 4,00,000/- విలువ కలిగిన డీడీని, పుల్సం పద్మ @ ఊరే @గంగక్క కు 5,00,000/- విలువ కలిగిన డీడీని అందజేశారు. వారికి భవిష్యత్తులో ఏ అవసరం కలిగిన ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని, సహకరిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మావోయిస్టు సిద్ధాంతంతో పని చేస్తున్న సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన అందరూ ప్రభుత్వం సరెండర్ కం రిహాబిలిటేషన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సమాజంలో ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి జనజీవన స్రవంతిలో చేరాలని తెలిపారు.