మన అగ్రిటెక్‌ను సందర్శించిన కలెక్టర్..
వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో మన అగ్రిటెక్ సంస్థ నెలకొల్పిన ఆధునిక

దిశ, వరంగల్ టౌన్ : వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో మన అగ్రిటెక్ సంస్థ నెలకొల్పిన ఆధునిక వ్యవసాయ పరికరాల ప్రదర్శన కేంద్రంను వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద గురువారం సందర్శించారు. నూతనంగా ఆవిష్కరించిన డ్రోన్ స్ప్రేయర్ మేళాను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఒక్కో స్టాల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత పాశికంటి రమేష్ స్టాళ్లలోని పరికరాల పనితీరును, డ్రోన్ స్పేయర్ ప్రత్యేకతలను, 8 సంవత్సరాలుగా మన అగ్రిటెక్ సంస్థ అందిస్తున్న పరికరాలను, ఇతర సేవలను కలెక్టర్‌కు ఛాయాచిత్రాల ద్వారా వివరించారు. మన అగ్రిటెక్ అందిస్తున్న పరికరాలకు అవసరమైన సబ్సిడీని ప్రభుత్వం అందించేందుకు సహకరించాలని పాశికంటి రమేశ్ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏనమాముల మార్కెట్ ఇన్‌చార్జ్ కార్యదర్శి జి.రెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బి. రవీందర్ రెడ్డి, మార్కెట్ అధికారులు పాల్గొన్నారు.