ఎండిన పంట పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలి

ఎండిపోయిన పంట పొలాలకు పంట నష్టం ఇవ్వాలని, ప్రతి ఎకరాకు రూ. 25 వేలు ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

Update: 2025-03-23 15:20 GMT
ఎండిన పంట పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలి
  • whatsapp icon

దిశ, హనుమకొండ : ఎండిపోయిన పంట పొలాలకు పంట నష్టం ఇవ్వాలని, ప్రతి ఎకరాకు రూ. 25 వేలు ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం దేవన్నపేట పంపు హౌస్ లను పరిశీలించి మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా వరంగల్, హన్మకొండ, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, సిద్ధిపేట , సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సుమారు 5 లక్షల 57 వేల ఎకరాలకు 2 పంటలకు సాగు నీరు ఇచ్చేలా కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు. దేవాదుల మూడవ దశ కింద రూ. 14 వందల 94 కోట్లతో రామప్ప చెరువు నుండి ఉనికిచెర్ల కు టన్నెల్, దేవన్నపేట వద్ద పంపు హౌస్ కేసీఆర్ పూర్తి చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలుగా పనులు ముందుకు సాగనియ్యలేదని అన్నారు. మోటార్ల బిల్లులు 4 నెలలుగా పెండింగ్ లో పెడితే అవి నడవని పరిస్థితి ఉంది అన్నారు. దేవన్నపేట పంప్ హౌస్ వద్ద ఉన్న భారీ సామర్ధ్యం గల మోటార్లు పరిశీలించి అక్కడ ఉన్న లిఫ్ట్ అడ్వయిజర్ పెంటా రెడ్డి, ఇరిగేషన్ ఎస్ ఈ వెంకటేశ్వర్లును ఆయన కలిశారు.

    ఇప్పటికే వేల ఎకరాలు ఎండిపోయి రైతులు ఆగం అయ్యారని, మిగిలి ఉన్న కొద్ది పాటి పంటలకైనా నీళ్లు ఇవ్వాలని అధికారులను కోరగా స్పందించి రేపటిలోగా పంపులు స్టార్ట్ చేసి నీళ్లు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ మోటార్లు ఆన్ చేయడానికి ఆస్ట్రియా దేశం నుండి వచ్చిన ఆండ్రిడ్జ్ కంపెనీ ఇంజనీర్స్ తో మాట్లాడి పనులు వేగవంతం చేయాలని కోరారు. ఆయన వెంట జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, బీఆర్ ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి , ఉమ్మడి వరంగల్ బీఆర్ ఎస్ ముఖ్య నాయకులు రైతు కోర్డినేటర్ నాగుర్ల వెంకన్న, నిమ్మగడ్డ వెంకన్న, మాజీ కార్పొరేటర్లు చింతల యాదగిరి, రాజు నాయక్, పాల్గొన్నారు.   


Similar News