సినిమాను తలపించే ఫైట్.. భూ తగాదాలే కారణమా..

జీకే తండాలో రెండు కుటుంబాల మధ్య భూ వివాదం కాస్త తీవ్ర ఘర్షణకు దారి తీసిన ఘటన తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది.

Update: 2025-03-26 07:24 GMT
సినిమాను తలపించే ఫైట్.. భూ తగాదాలే కారణమా..
  • whatsapp icon

దిశ, దేవరుప్పుల : జీకే తండాలో రెండు కుటుంబాల మధ్య భూ వివాదం కాస్త తీవ్ర ఘర్షణకు దారి తీసిన ఘటన తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జీకే తండాకు చెందిన భద్రమ్మ, అదే తండాకు చెందిన రమేష్ ల మధ్య గత కొద్ది రోజులుగా బాట పంచాయతీ నడుస్తుంది. గతంలో కొన్ని సార్లు పెద్దమనుషుల సమక్షంలో ఇరువర్గాలు తీర్మానాలు చేసి పంచాయతీ సర్ధుమనిగాక, భద్రమ్మా కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం ఎల్లమ్మ పండుగ చేసుకుంటున్న క్రమంలో రమేష్ కుటుంబ సభ్యులు భద్రమ్మ ఇంటికి చేరుకుని గొడవకు దిగారు.

అదే క్రమంలో రమేష్ కుటుంబ సభ్యులు భద్రమ్మ పై గొడ్డలితో దాడి చేయగా భద్రమ్మకు గాయాలు కాగా వెంటనే భద్రమ్మ కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం తొర్రూరు ఆసుపత్రికి తరలించారు. తిరిగి రమేష్ కుటుంబ సభ్యులు తొర్రూరు ఆసుపత్రి వద్దకు చేరుకోగా ఇరు కుటుంబాలు సినిమాను తలపించే విధంగా పట్టణ కేంద్రం అన్నారం రోడ్డు పై రాళ్ళతో దాడి చేసుకున్నారు. దీంతో అక్కడే ఉన్న ప్రాంత ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ ఉపేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News