మరియాపురం అభివృద్ధి అభినందనీయం..: రాజస్థాన్ ప్రతినిధుల బృందం
జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామంగా గుర్తింపు పొందిన మరియాపురం గ్రామ అభివృద్ధి

దిశ,గీసుగొండ: జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామంగా గుర్తింపు పొందిన మరియాపురం గ్రామ అభివృద్ధి అభినందనీయం అని రాజస్థాన్ ప్రతినిధుల బృందం కొనియాడారు. జాతీయస్థాయిలో ఆదర్శ గ్రామంలో గుర్తింపు పొందిన మర్యాద పురం గ్రామాన్ని రాజస్థాన్ అధికారులు ప్రజా ప్రతినిధుల సభ్యులు బుధవారం సందర్శించారు. గ్రామంలో తడి చెత్త పొడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేయడం కానీ ద్వారా గ్రామపంచాయతీకి ఆదాయం రావడం పరిశుద్ధ కార్యక్రమాల నిర్వహణ దోమల రాహిత గ్రామంగా గుర్తింపు పొందడం వంటి కార్యక్రమాలతో జాతీయస్థాయి ఆరోగ్యవంతమైన గ్రామంగా మరియాపురం గుర్తింపు పొందిందని ఎంపీడీఓ వి.కృష్ణవేణి వివరించారు.
గ్రామ తాజా మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి ఐదు సంవత్సరాలలో మరియాపురం గ్రామాన్ని గ్రామస్తుల సహకారంతో జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో ఆదర్శంగా తీర్చిదిద్దామని రాజస్థాన్ ప్రతినిధి బృందానికి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఐఆర్ డీసీడీపీఏ అనిల్ కుమార్ వరంగల్ జిల్లా పంచాయతీ అధికారి కటకం కల్పన,అసోసియేట్ ప్రొఫెసర్ ఎస్ఐఆర్డి రాజస్థాన్ మురళి లాల్ శర్మ,స్టేట్ క్లారిటీ అధికారి పునీత్ మోరియా, డిఆర్డిఓ కౌసల్యాదేవి,ఎంపీఓ ఆడెపు ప్రభాకర్,ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి,ఫ్యాకల్టీ కరుణాకర్, ఏపీఓ చంద్రకాంత్, ఎన్ఐఆర్డీ శేఖర్, మెడికల్ అధికారి కిరణ్, అంగన్వాడి సూపర్వైజర్ స్వప్న, జిల్లా పరిషత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.