తల్లి తండ్రిని కోల్పోయిన అనాధ బాలికకు ఆర్థిక సాయం..

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం లో బొమ్మెర సాయి ప్రియ అనే బాలిక

Update: 2025-03-24 13:58 GMT
తల్లి తండ్రిని కోల్పోయిన అనాధ బాలికకు ఆర్థిక సాయం..
  • whatsapp icon

దిశ,రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం లో బొమ్మెర సాయి ప్రియ అనే బాలిక బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాధగా మిగిలింది. మండలం లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నీరు పేదలకు నీడగా ఉంటున్న ఎస్ ఆర్ ఆర్ సంస్థ అధినేత పరుపాటి శ్రీనివాసరెడ్డి సాయి ప్రియ తండ్రి సతీష్ దశదిన కర్మ లో పాల్గొన్నారు. సతీష్ చిత్రపటానికి పూలమాలవేసి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా పరుపాటి మాట్లాడుతూ అతి చిన్న వయసులో సాయి ప్రియ తల్లిదండ్రులను కోల్పోవడం చాలా బాధాకరం అన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశానుసారం మండలం లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జానుమిరెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్, మాజీ సర్పంచ్ గారి నరసయ్య పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News