ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించండి : అశ్విని తానాజీ వాకడే
ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని బల్దియా కమిషనర్ అశ్విని

దిశ,వరంగల్ టౌన్ : ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకొని బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుండి 103 విజ్ఞప్తులను స్వీకరించి పరిష్కార నిమితం వివిధ విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు. కాగా, ఇంజనీరింగ్ విభాగానికి ౧౬ హెల్త్ అండ్ శానిటేషన్‌కు 15, ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ) 20, టౌన్ ప్లానింగ్ 45, మంచినీటి సరఫరా విభాగానికి 7 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, ఎస్‌ఈ ప్రవీణ్ చంద్ర, బయాలజిస్ట్ మాధవ రెడ్డి, సెక్రటరీ అలివేలు, హెచ్‌ఓ రమేష్, ఇన్చార్జి సిపి రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.