మొక్కలకు నీళ్లు పోస్తూ విగతజీవిగా మారిన వ్యక్తి..
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలో చాగల్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, జనగామ : జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలో చాగల్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బండ హరీష్ (35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్ల మధ్య ఉన్న మొక్కలకు నీళ్ళు పడుతున్న వాటర్ ట్యాంకర్ ను వెనకాల నుంచి లారీ వచ్చి ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి రాఘవపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.